Share News

Sri Lanka: దేశాధ్యక్షుడి ఎన్నికల వేళ.. కొలంబోకు అజిత్ దోవల్

ABN , Publish Date - Aug 30 , 2024 | 07:31 AM

కొలంబో భద్రత సదస్సు శుక్రవారం జరగనుంది. ఈ సదస్సులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనున్నారు. అందుకు కోసం గురువారమే ఆయన శ్రీలంక రాజధాని కొలంబో చేరుకున్నారు.

Sri Lanka: దేశాధ్యక్షుడి ఎన్నికల వేళ.. కొలంబోకు అజిత్ దోవల్

కొలంబో, ఆగస్ట్ 30: కొలంబో భద్రత సదస్సు శుక్రవారం జరగనుంది. ఈ సదస్సులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనున్నారు. అందుకు కోసం గురువారమే ఆయన శ్రీలంక రాజధాని కొలంబో చేరుకున్నారు. ఈ సదస్సుకు మాల్దీవులు, మారిషస్‌తోపాటు బంగ్లాదేశ్, సీషెల్స్ దేశాలకు చెందిన ఉన్నతాధికారులు సైతం హాజరుకానున్నారు. సముద్ర భద్రత, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఆపద సమయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, సాంకేతికను పరిరక్షించడం, మానవతా సహాయం, విపత్తు ఉపశమనం తదితర అంశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.


ఈ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో అజిత్ దోవల్ సమావేశం కానున్నారు. మరికొద్ది వారాల్లో శ్రీలంక దేశాధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఆ దేశాధ్యక్షుడితో అజిత్ దోవల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా శ్రీలంకలోని రాజకీయ పార్టీల నేతలో అజిత్ దోవల్ భేటీ కానున్నారని సమాచారం. అయితే అజిత్ దోవల్ శ్రీలంక పర్యటనపై భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.


కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్

ప్రాదేశిక సముద్ర జలాల భద్రత కోసం.. కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్ నిర్వహించాలని భారత్, శ్రీలంక, మాల్దీవుల్‌ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం 2011లో ఆ యా దేశాలు గ్రూప్‌గా ఏర్పడి కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌ను ఏర్పాటు చేశాయి. అనంతరం ఈ గ్రూప్‌లో మారిషస్ చేరింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, సీషెల్స్ దేశాలు పరిశీలక హోదాను కల్పించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Updated Date - Aug 30 , 2024 | 09:48 AM