Share News

Kargil War: కార్గిల్ యుద్ధం మా పనే: పాతికేళ్ల తర్వాత ఒప్పుకున్న పాక్

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:47 PM

కార్గిల్ యుద్ధంలో పాక్ పాత్రను స్వయానా ఆ దేశ సైన్యాధిపతి అంగీకరించారు. దీంతో పాతకేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం తమ పనేనని పాక్ అధికారికంగా అంగీకరించినట్టయింది.

Kargil War: కార్గిల్ యుద్ధం మా పనే: పాతికేళ్ల తర్వాత ఒప్పుకున్న పాక్

ఇస్లామాబాద్: భారత్‌-పాకిస్థాన్ మధ్య 1999 మే-జూలై మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం (Kargil War)లో తమ పాత్ర లేదంటూ ఇంతవరకూ బుకాయించిన పాకిస్థాన్ (Pakistan) గుట్టు ఎట్టకేలకు రట్టయింది. కార్గిల్ యుద్ధంలో పాక్ పాత్రను స్వయానా ఆ దేశ సైన్యాధిపతి అంగీకరించారు. దీంతో పాతకేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం తమ పనేనని పాక్ అధికారికంగా అంగీకరించినట్టయింది.


'డిఫెన్స్ డే' సందర్భంగా పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ, భారత్, పాక్ మధ్య 1948, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేశారని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో తమ ప్రమేయం ఉందని పాక్ మిలటరీ బహిరంగంగా ఒప్పుకోవడం ఇదే ప్రథమం.

Kamala Harris: డొనాల్డ్ ట్రంప్‌ను బీట్ చేసిన కమలా హారిస్.. ఆగస్టు విరాళాలలో


నాటి ఘటన..

అప్పట్లో ముజాహిదీన్‌ల ముసుగులో శత్రు సేనలు నియంత్రణ రేఖను దాటి భారత భూబాగంలోకి అడుగుపెట్టాయి. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను వశం చేసుకోవడంతో భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' పేరుతో వారిపై అరివీర భయంకరంగా విరుచుకుపడింది. దీంతో పాక్ బలగాలు తోకముడిచాయి. 'ఆపరేషన్ విజయ్' విజయవంతమైనట్టు జూన్ 26న ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇదే రోజును ఏటా 'కార్గిల్ దివస్'ను భారత్ జరుపుకొంటోంది. కాగా, ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కశ్మీర్ తిరుగుబాటుదారులు (ముజాహిదీన్‌లు) ఈ దాడులకు పాల్పడ్డారని దాయాది దేశం బుకాయిస్తూ వచ్చింది. తాము కేవలం పెట్రోలింగ్ మాత్రమే చేశామని చెబుతూ వచ్చింది. పాక్ వాదనను భారత్ ఖండిస్తూ, ఆ దేశ ఆర్మీ చీఫ్ ముషారఫ్, డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్‌లు రావల్పిండిలో మే 26, మే 29న జరిపిన ఫోన్ సంభాషణలను కూడా విడుదల చేసింది. అయినప్పటికీ పాక్ అధికారికంగా తమ పాత్రను ఎన్నడూ ఒప్పుకోలేదు.


Read MoreInternational News and Latest Telugu News

Updated Date - Sep 07 , 2024 | 05:47 PM