Home » Islamabad
ఆర్మీ కథనం ప్రకారం, మంగళవారం రాత్రి బన్ను జిల్లాలోని మలిఖేల్ జనరల్ ఏరియాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడియత్నం చేశారు. చెక్‌పోస్ట్‌లోకి ప్రవేశించాలనే వారి ప్రయత్నాన్ని బలగాలు, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ మీడియా వింగ్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరిగింది.
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూడు వ్యవస్థల్లో ఒకటైన న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేలా.. 25వ రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
జైశంకర్‌కు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్థాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు దిగజారిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి.
ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ రొటేటింగ్ చైర్మన్షిప్ ఈసారి పాకిస్థాన్‌కు వచ్చింది. శిఖరాగ్ర సమావేశానికి ముందు మంత్రి వర్గ సమావేశం, ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంస్కృతి, మానవతా సహాయంపై దృష్టి సారించేందుకు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.
పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు జకీర్ నాయక్ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం చేరుకున్నారు.
కార్గిల్ యుద్ధంలో పాక్ పాత్రను స్వయానా ఆ దేశ సైన్యాధిపతి అంగీకరించారు. దీంతో పాతకేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం తమ పనేనని పాక్ అధికారికంగా అంగీకరించినట్టయింది.
భారత ప్రధాని నరేంద్రమోదీని ఇస్లామాబాద్‌కు రావాల్సిందిగా పాకిస్థాన్ ఆహ్వానించింది.
ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్‌ను పాకిస్థాన్ ఆర్మీ అరెస్టు చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాలతో అదుపులోకి తీసుకుంది.
పాకిస్థాన్‌లో హిందువుల జనాభా పెరిగింది. 2017లో 35 లక్షలుగా ఉన్న సంఖ్య 2023లో 38 లక్షలకు పెరిగింది. 2023 జనాభా లెక్కల వివరాలను ప్రముఖ పత్రిక డాన్ గురువారం ప్రచురించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్' ను నిషేధించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంటున్నామని ఆ దేశ సమాచార శాఖ మత్రి అత్తావుల్లా తరార్ సోమవారంనాడిక్కడ తెలిపారు.