Share News

Zakir Naik: పరారీలో ఉన్న జకీర్ నాయక్‌కు పాకిస్థాన్ రెడ్‌కార్పెట్

ABN , Publish Date - Sep 30 , 2024 | 05:04 PM

పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు జకీర్ నాయక్ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం చేరుకున్నారు.

Zakir Naik: పరారీలో ఉన్న జకీర్ నాయక్‌కు పాకిస్థాన్ రెడ్‌కార్పెట్

ఇస్లామాబాద్: మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణలపై భారత్‌ నుంచి పారిపోయి మలేసియాలో ఉంటున్న వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌ (Zakir Naik)కు పాకిస్థాన్ (Paksistan) సోమవారంనాడు రెడ్‌కార్పెట్ స్వాగతం పలికింది. పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఆయన ఇస్లామాబాద్ విమానాశ్రయానికి ఉదయం చేరుకున్నారు. ఆయనకు ప్రధాన మంత్రి యూత్ ప్రోగ్రాం చైర్మన్ రానా మసూద్, రెలిజియస్ అఫైర్ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ సైయద్ అటావుర్ రహమాన్ తదితర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు స్వాగతం పలికారు. జకీర్ వెంట ఆయన కుమారుడు ఫరిఖ్ నాయక్ కూడా పాక్ టూర్‌లో పాల్గొంటున్నారు.


అధికార వర్గాల సమాచారం ప్రకారం, జకీర్ నాయక్ నెలరోజుల పాటు జరిపే పాక్ ఈ పర్యటనలో పలువురు ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశమవుతారు. పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొంటారు. పాకిస్థాన్ ఆహ్వానం మేరకు డాక్టర్ జకీర్ నాయక్, షేక్ ఫరిఖ్ నాయక్ పాక్ టూర్‌లో పాల్గొంటున్నట్టు ఆయన టీమ్ ఒక ట్వీట్ చేసింది. అక్టోబర్ 5,6 తేదీల్లో కరాచీలోనూ, 12-13 తేదీల్లో ఇస్లామాబాద్, 19-20 తేదీల్లో ఇస్లామాబాద్‌లోనూ ఆయన ఉపన్యాసాలు ఉంటాయని తెలిపింది.

Govt Jobs: సంచలన నిర్ణయం.. లక్ష 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు


విద్వేష ప్రసంగాలతో జకీర్ నాయక్ వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వ ఎజెన్సీ ఎన్ఐఏ వాటెండ్ లిస్ట్‌లో ఆయన ఉన్నారు. 2016 మనీ లాండరింగ్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం మలేసియాలో ఉంటున్నారు. రెచ్చగెట్టే ప్రసంగాలు చేశాడనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. వివాదాస్పద ప్రవృత్తి కారణంగా ఆయన సొంత ఛానెల్ 'పీస్ టీవీ'పై భారత్‌, బంగ్లాదేశ్, శ్రీలంకలో నిషేధం ఉంది. ఆయనను తమ దేశంలో అడుగుపెట్టేందుకు కెనడా, యూకే సైతం నిరాకరించాయి.


For More International News and Telugu News కొరకు..

Updated Date - Sep 30 , 2024 | 05:04 PM