Share News

US Elections 2024: కమలాకు ఒబామా మద్దతు నిరాకరణ వెనక అసలు కారణం ఇదే

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:04 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections 2024) ప్రచార హోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ట్రంప్‌పై తుపాకీతో కాల్పుల ఘటన తరువాత ప్రచారం పతాకస్థాయికి చేరింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ని రంగంలోకి దింపబోతున్నారే వార్తలు వెలువడుతున్నాయి.

US Elections 2024: కమలాకు ఒబామా మద్దతు నిరాకరణ వెనక అసలు కారణం ఇదే

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections 2024) ప్రచార హోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ట్రంప్‌పై తుపాకీతో కాల్పుల ఘటన తరువాత ప్రచారం పతాకస్థాయికి చేరింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ని రంగంలోకి దింపబోతున్నారే వార్తలు వెలువడుతున్నాయి.

అయితే ఆమె అభ్యర్థిత్వానికి చాలా మంది డెమొక్రటిక్ నాయకులు మద్దతు తెలిపినప్పటికీ.. అమెరికాకు రెండుసార్లు అధ్యక్షుడిగా పని చేసిన ఆ పార్టీ సీనియర్ నేత బరక్ ఒబామా(Barack Obama) మాత్రంమ మద్దతు ఇవ్వట్లేదు.


అసలు ఒబామా మద్దతు నిరాకరణ వెనక కారణమేంటి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని కమలా హారిస్ ఓడించలేరని ఒబామా భావిస్తున్నారు. ఈ విషయాన్ని బైడెన్ కుటుంబ సభ్యులే చెబుతున్నారు. ఓ వైపు బైడెన్‌ తప్పుకోవడాన్ని సమర్థిస్తూనే.. గెలిచే నేతను బరిలోకి దింపాలని రిపబ్లికన్ పార్టీ అధిష్టానానికి సూచించారు.

అయితే అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ అభ్యర్థిత్వానికి ఒబామా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన భార్య మిషెల్ ఒబామాను పోటీలో ఉంచాలని చూస్తున్నట్లు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కమలా హారిస్‌పై ఒబామా కోపంగా ఉన్నారని.. అందుకే మద్దతు ఇవ్వట్లేదని వార్తలు వస్తున్నాయి. అయితే మిషెల్ ఒబామా మాత్రం పోటీకి ఆసక్తికరంగా లేరని తెలుస్తోంది.


బైడెన్ తప్పుకోవడంపై..

వైట్ హౌస్ రేసు నుండి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. బైడెన్‌ తీసుకున్న నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని ఒబామా వ్యాఖ్యానించారు. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని.. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు.


అధ్యక్షుడిగా బైడెన్‌ అంతర్జాతీయ వేదికపై అమెరికా గొప్పతనాన్ని ఇనుమడింపజేశారని, నాటోను పునరుజ్జీవింపజేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారన్నారు. అయితే రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని, అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో డెమొక్రటిక్ పార్టీ ఆచితూచి అడుగులు వేయాలని అప్రమత్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ని అధ్యక్ష బరిలో నిలపాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నా.. ఒబామా ఈ అంశాన్ని లేవనెత్తకపోవడం, అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అనడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది.


హారిస్‌కి మద్దతు ప్రకటించని మరొకరు

కమలా హారిస్‌ అభ్యర్థిత్వానికి బైడెన్‌ మద్దతు ప్రకటించగా.. ఒబామా మాత్రం ఇప్పటివరకు ఆమెకు మద్దతు ప్రకటించకపోగా.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకురావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఒబామాను హారిస్‌కు మెంటార్‌గా చెబుతుంటారు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత నాన్సీ పెలోసీ సైతం కమలా హారస్‌కు మద్దతు ప్రకటించకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. 2007లో జిల్లా న్యాయవాదిగా పనిచేస్తూ.. అధ్యక్ష బరిలో నిలిచిన బరాక్ ఒబామాకు కమలా.. మద్దతు తెలిపారు. ఒబామా అధ్యక్షుడైన తర్వాత 2010లో ఆమె అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 25 , 2024 | 12:04 PM