Lockdown: అక్టోబర్ 16 వరకు స్కూళ్లు, కాలేజీలు, పెళ్లిళ్లు బంద్.. కారణమిదే..
ABN , Publish Date - Oct 14 , 2024 | 04:07 PM
ఈ ప్రాంతంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 16 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయని ప్రకటించారు. దీంతోపాటు పెళ్లిళ్లు సహా అనేక కార్యక్రమాలపై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇక్కడి ప్రభుత్వం అక్టోబర్ 16 వరకు పాఠశాలలు, కళాశాలలకు బంద్ ప్రకటించింది. అంతేకాదు పెళ్లిళ్లపై కూడా నిషేధం విధించింది. అయితే పాకిస్థాన్(pakistan) ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాజరయ్యే ఉన్నతస్థాయి వ్యక్తుల భద్రత కోసం రాజధాని ప్రాంతంలో లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ నుంచి తీవ్రవాద కార్యకలాపాల ఆందోళనలు, వ్యతిరేకత వంటి చర్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇస్లామాబాద్ భద్రత బాధ్యతను సైన్యానికి అప్పగించింది.
ఈ ప్రాంతంలో
ఈ నేపథ్యంలో సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధుల భద్రతను సులభతరం చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 14 నుంచి 3 రోజుల వరకు సెలవు ప్రకటించింది. ఈ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, స్నూకర్ క్లబ్‌లు, మ్యారేజ్ హాల్స్‌ను మూసి ఉంచాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
10,000 మందికి పైగా పోలీసులు
మంగళ, బుధవారాల్లో జరిగే రెండు రోజుల సదస్సుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్, చైనా ప్రధాని లీ కియాంగ్ సహా ప్రాంతీయ ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరవుతున్నారు. అక్టోబర్ 15, 16 తేదీలలో 23వ SCO సమ్మిట్ కోసం ఇస్లామాబాద్‌కు చేరుకునే దాదాపు 900 మంది ప్రతినిధులకు భద్రత కల్పించడానికి 10,000 మందికి పైగా పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించారు. ఇప్పటికే అక్టోబర్ 5 నుంచి 17 వరకు రాజధాని ఇస్లామాబాద్‌లో భద్రతను పటిష్టం చేయడానికి ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం సైనిక దళాలను మోహరించింది.
బెదిరించిన పీటీఐ
ఈ సదస్సు నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (PTI) నిరసన తెలుపుతామని బెదిరించింది. పాక్ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ చౌదరి PTI కార్యక్రమాన్ని అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. PTI పాకిస్తాన్ సానుకూల కోణాన్ని ప్రపంచానికి చూపించాలనుకోవడం లేదని.. బదులుగా గందరగోళంలో ఉన్న దేశాన్ని సృష్టించడమే వారి లక్ష్యమని వ్యాఖ్యానించారు.
ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం
మరోవైపు SCO సమ్మిట్ కోసం PAF బేస్ నూర్ ఖాన్, రావల్పిండి, న్యూ ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రముఖుల రాక నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రావల్పిండి జిల్లాలో అక్టోబర్ 10 నుంచి 17 వరకు 8 రోజులపాటు సెక్షన్ 144 విధించింది. ఈ సమయంలో అన్ని రాజకీయ సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు సహా ఎలాంటి కార్యకలాపాలను జరపకూడదని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More International News and Latest Telugu News