Share News

Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఆ దేశం మాదిరిగానే..

ABN , Publish Date - Nov 21 , 2024 | 11:07 AM

16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేధించే చట్టాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటగా ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఇది త్వరలో అమల్లోకి రానుంది. అయితే ఈ క్రమంలో యూకే కూడా ఇదే బాటలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఆ దేశం మాదిరిగానే..
Social media ban

ఆస్ట్రేలియా (australia) మాదిరిగానే ఇప్పుడు యూకే (UK) ప్రభుత్వం కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధాన్ని విధించాలని పరిశీలిస్తోంది. UK టెక్నాలజీ సెక్రటరీ పీటర్ కైల్ ఆన్‌లైన్ భద్రతను నిర్ధారించడానికి, ప్రధానంగా పిల్లల కోసం ఏమి చేయాలో అది చేస్తామని ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టీనేజ్ యువత ఎక్కువగా సోషల్ మీడియా బారిన పడటం వల్ల తప్పుడు ప్రవర్తన, విద్యార్థుల చదువులు, ఆటలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


అమెరికాలో కూడా..

యువతపై స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా (social media) ప్రభావాలపై పరిశోధనను కూడా చేసినట్లు ప్రస్తావించారు. మీడియా రెగ్యులేటర్ ఆఫ్‌కామ్‌కు వ్యూహాత్మక ఉద్దేశ లేఖలో ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ (OSA) కింద రెగ్యులేటర్ కొత్త అధికారాలను పొందుతున్నందున కైల్ తన ప్రాధాన్యతలను వివరించారు. అయితే యూకేలో ఎప్పటి నుంచి కార్యరూపం దాల్చనుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటికే అమెరికాలో కూడా చిన్న పిల్లలు మెటా, ఇన్‌స్టాగ్రాం ఉపయోగించే విషయంలో కొత్తగా కొన్ని ఫీచర్లను అమల్లోకి తెచ్చారు. పిల్లల్లో సోషల్ మీడియా వినియోగంపై పెరేంట్స్ అనుమతి తీసుకునే విధంగా మార్పులు చేశారు.


ప్రపంచంలో మొట్టమొదటి దేశం

మరోవైపు 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేధించే విషయంలో ప్రపంచంలోనే మొట్టమొదటి చట్టాన్ని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్ మంత్రి గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సమాజంలో కొత్త ప్రామాణిక విలువను నెలకొల్పడానికి ప్రయత్నిస్తుందని ఆస్ట్రేలియా మంత్రి Michelle Rowland అన్నారు. యుక్త వయస్కులు, పిల్లలు ఫిల్టర్ చేయని అనేక కంటెంట్ స్ట్రీమ్‌లకు గురికాకుండా నిరోధించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ బిల్లుకు రాజకీయంగా విస్తృత మద్దతు లభించింది.


ఎంత సమయం..

ఇది చట్టంగా మారిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌లకు వయోపరిమితిని ఎలా అమలు చేయాలో తెలుసుకోవడానికి ఒక సంవత్సరం సమయం ఉంటుందన్నారు. ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తుందని, పీఎం ఆంథోనీ అల్బనీస్ పిల్లలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి నిషేధించే చట్టాన్ని ప్రవేశపెట్టామని ఇటివల తెలిపారు.

పరిమితులు

ఈ క్రమంలో యువత ఆరోగ్యం, వారి విద్యకు మద్దతు ఇచ్చే సందేశ సేవలు, ఆన్‌లైన్ గేమ్‌లు లేదా ప్లాట్‌ఫారమ్‌లపై పరిమితులు ఉంటాయని రోలాండ్ చెప్పారు. 14 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల ఆస్ట్రేలియన్లలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఆత్మహత్య లేదా హింసాత్మక కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. దీని ద్వారా అసురక్షిత ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే విధానం పెరిగింది. దీంతోపాటు 18 ఏళ్లలోపు పిల్లలు ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలను యాక్సెస్ చేయకుండా నిరోధించే మార్గాలను కూడా ఆస్ట్రేలియా పరిశీలిస్తోందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.


ఇవి కూడా చదవండి:

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 21 , 2024 | 11:13 AM