Share News

Elon Musk: అమెరికా ఎన్నికల వేళ.. ఎలాన్ మస్క్ భారీ విరాళం, కారణమిదేనా?

ABN , Publish Date - Jul 13 , 2024 | 01:26 PM

అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు(US Elections 2024) జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 'భారీ' మొత్తం విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Elon Musk: అమెరికా ఎన్నికల వేళ.. ఎలాన్ మస్క్ భారీ విరాళం, కారణమిదేనా?
Musk huge donation to Donald Trump

అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు(US Elections 2024) జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్(Joe Biden), మళ్లీ పోటీ చేయనున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోగ్యంపై డెమోక్రటిక్ పార్టీలో ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్(elon musk) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 'భారీ' మొత్తం విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం డొనాల్డ్ ట్రంప్‌ను మరోసారి వైట్‌హౌస్‌కి పంపడానికి పని చేస్తున్న సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి మస్క్ ఈ విరాళం ఇచ్చారు.


సన్నిహితంగా..

ఎలాన్ మస్క్(Elon Musk) 2024 అధ్యక్ష రేసులో ఇంకా ఏ రాజకీయ నాయకుడిని కూడా బహిరంగంగా ఆమోదించలేదు. ట్రంప్ లేదా బైడెన్‌ల ఎన్నికల ప్రచారానికి నిధులు వస్తాయని తాను ఆశించడం లేదని ఈ ఏడాది ప్రారంభంలో చెప్పాడు. కానీ అంతలోనే ఈ విరాళం ప్రకటించడంతో మస్క్ ట్రంప్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఫ్రీ స్పీచ్ సమస్యలపై ట్రంప్, ఎలాన్ మస్క్ గతంలో చాలాసార్లు గొడవపడ్డారు. కానీ టెక్ వ్యవస్థాపకుడి ఎలక్ట్రిక్ వాహనాలు, క్రిప్టో పాలసీ సహా పలు అంశాల నేపథ్యంలో వీరిద్దరూ సన్నిహితంగా మారినట్లు తెలుస్తోంది.


బైడెన్‌కు ట్రంప్

దీంతో వాల్ స్ట్రీట్(wall street), కార్పొరేట్ దాతల సహాయంతో నిధుల సేకరణలో ట్రంప్ తన ప్రత్యర్థి అధ్యక్షుడు జో బైడెన్‌ను మించి పోయారని చెప్పవచ్చు. ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత పలువురు దాతలు బైడెన్‌కు కూడా పెద్ద సంఖ్యలో నిధులను పంపించారు. ఈ క్రమంలోనే 2024 US ఎన్నికలకు ముందు భారీ విరాళం ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 5న జరగనున్న ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ అధికారికంగా నామినేట్ అయ్యే అవకాశం ఉంది.


ఇది కూడా చదవండి:

Hyderabad: అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌..

Hyderabad: మందుబాబులకు జైలుశిక్ష..


Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

Read Latest International News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 01:33 PM