Share News

Woman Looted: లక్ష కోట్లకుపైగా లూటీ చేసిన మహిళ... షాకైన అధికారులు

ABN , Publish Date - Jan 31 , 2024 | 09:55 PM

ఓ మహిళ చేసిన సంచలన కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. అది ఏకంగా లక్ష కోట్లకుపైగా(12.5 బిలియన్ డాలర్లు) ఉండటం విశేషం. ఈ ఘటన ఇటివల వియత్నాంలో చోటుచేసుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Woman Looted: లక్ష కోట్లకుపైగా లూటీ చేసిన మహిళ... షాకైన అధికారులు

ఓ మహిళ చేసిన సంచలన కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. అది ఏకంగా లక్ష కోట్లకుపైగా(12.5 బిలియన్ డాలర్లు) ఉండటం విశేషం. ఈ ఘటన ఇటివల వియత్నాంలో చోటుచేసుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం. ఈ అతిపెద్ద మోసం కేసులో ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ వాన్ తిన్హ్ పాట్ కంపెనీ ఛైర్ పర్సన్ ట్రూంగ్ మైలాన్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ మహిళ సైగాన్ కమర్షియల్ బ్యాంక్ (SCB) నుంచి కొన్నేళ్లుగా దాచుకున్న ప్రజల సొమ్మును కాజేసింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Investment Fraud: ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్ పేరుతో యువతి రూ.3 కోట్లకుపైగా దోపిడీ..అరెస్ట్!


దీంతో ఆ బ్యాంకులో డబ్బులు దాచుకున్న 42 వేల మందిపై ప్రభావం పడింది. అంతేకాదు ఏకంగా ఆ బ్యాంక్ కార్యకలాపాలు ఆగిపోయే స్థితికి వచ్చింది. ఎందుకంటే ఆ మహిళకు బ్యాంకులో 90 శాతానికి పైగా వాటా ఉంది. 2018 నుంచి 2022 మధ్య ఏకంగా 916 ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ మహిళ బ్యాంక్ నుంచి 304 మిలియన్ డాంగ్ (వియత్నాం కరెన్సీ)ని తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని ఆమె డ్రైవర్ హో చి మిన్ సిటీలోని బ్యాంక్ నుంచి 4.4 బిలియన్ డాలర్ల నగదును లాన్ నివాసానికి తరలించినట్లు అధికారులు వివరాలను వెల్లడించారు.

దీంతో వియత్నాం ఆర్థిక వ్యవస్థ, అస్థిరమైన విదేశీ పెట్టుబడిదారులను దెబ్బతీసిందని విశ్లేషకులు అంటున్నారు. వేల మంది ప్రజలు పెట్టుబడి పెట్టిన సోమ్మును దోచుసుకున్నారని అన్నారు. ఈ క్రమంలో హనోయి, హో చి మిన్ సిటీలలో బాధితులు నిరసనలు తెలిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మాజీ సెంట్రల్ బ్యాంకర్లు, మాజీ SCB ఎగ్జిక్యూటివ్‌లు, మాజీ ప్రభుత్వ అధికారులతో సహా 85 మంది ఇతరులు లాన్‌తో పాటు విచారణను ఎదుర్కొంటారు.

Updated Date - Jan 31 , 2024 | 09:55 PM