చేతబడి అనుమానంతో హైతీలో 184 మంది వృద్ధుల ఊచకోత
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:12 AM
సాయుధ గ్యాంగుల హింసతో అట్టుడుకుతున్న హైతీలో ఒక బలమైన గ్యాంగ్ నాయకుడు గత వారాంతంలో 184 మంది వృద్ధులను ఊచకోత కోయించాడని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు వోకర్ టర్క్ చెప్పారు.
జెనీవా, డిసెంబరు 9: సాయుధ గ్యాంగుల హింసతో అట్టుడుకుతున్న హైతీలో ఒక బలమైన గ్యాంగ్ నాయకుడు గత వారాంతంలో 184 మంది వృద్ధులను ఊచకోత కోయించాడని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు వోకర్ టర్క్ చెప్పారు. హైతీ రాజధాని పోర్ట్-ఔ-ప్రిన్స్‌కు సమీపంలోని సిటే సోలీల్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగినట్టు సోమవారం తెలిపారు. వార్ఫ్ జెరెమీ గ్యాంగ్ నాయకుడు మానెల్ మికానో ఫెలిక్స్ కుమారుడు అనారోగ్యానికి గురై శనివారం మరణించాడు. వృద్ధులు చేతబడి చేయడం వల్లే అతడి ఆరోగ్యం క్షీణించిందని ఊడో మతబోధకుడు ఒకరు చెప్పడంతో ఫెలిక్స్ అనుచరులు కొడవళ్లు, కత్తులతో స్వైర విహారం చేసి శుక్ర, శనివారాల్లో వృద్ధులను చంపేశారని టర్క్ వెల్లడించారు.