Share News

Washington : కమలా హారిస్‌ ఓ ‘బిచ్‌’.. నోరుపారేసుకున్న ట్రంప్‌

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:26 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారి్‌సపై నోరు పారేసుకుంటున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మరింత దిగజారారు.

 Washington : కమలా హారిస్‌ ఓ ‘బిచ్‌’.. నోరుపారేసుకున్న ట్రంప్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 11: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారి్‌సపై నోరు పారేసుకుంటున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మరింత దిగజారారు. ఒక ప్రైవేటు సమావేశంలో ఆమెను ‘బిచ్‌’ అని దూషించినట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది.

ఇప్పటికే బహిరంగ సభల్లో ఆమెను ‘అసమర్థురాలు, తెలివితక్కువ మహిళ’ అని తిట్టిన ట్రంప్‌.. తన నోటికి అదుపు లేదని నిరూపించుకున్నారు. ఎన్నికల రేసులో కమలా హారిస్‌ కంటే ట్రంప్‌ వెనుకబడుతున్నారన్న వార్తలతో ఆయన దుర్భాషలాడడం పెరిగిపోయింది. ఇంతకుముందు పలువురు మహిళలను కూడా నీచులు, మూర్ఖులు అని ట్రంప్‌ దూషించారు. వారిలో రాజకీయ ప్రత్యర్థులు, కఠిన ప్రశ్నలు అడిగిన మహిళా జర్నలిస్టులు ఉన్నారు.

Updated Date - Aug 11 , 2024 | 03:26 AM