Share News

WHO: బర్డ్ ఫ్లూతో తొలి మరణం.. బాధితుడి లక్షణాలివే

ABN , Publish Date - Jun 06 , 2024 | 08:02 AM

ప్రపంచంలో బర్డ్ ఫ్లూ(Bird Flu) తొలి మరణం మెక్సికోలో(Mexico) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధ్రువీకరించింది. 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్‌లో తీవ్రమైన జ్వరం, శ్వాస ఆడకపోవడం, అతిసారం, వికారం తదితర జబ్బులతో బాధపడుతూ మెక్సికోలోని ఓ ఆసుపత్రిలో చేరాడు.

 WHO: బర్డ్ ఫ్లూతో తొలి మరణం.. బాధితుడి లక్షణాలివే

మెక్సికో: ప్రపంచంలో బర్డ్ ఫ్లూ(Bird Flu) తొలి మరణం మెక్సికోలో(Mexico) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధ్రువీకరించింది. 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్‌లో తీవ్రమైన జ్వరం, శ్వాస ఆడకపోవడం, అతిసారం, వికారం తదితర జబ్బులతో బాధపడుతూ మెక్సికోలోని ఓ ఆసుపత్రిలో చేరాడు.

చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 24న మరణించాడు. అతనికి మూత్రపిండాల వ్యాధి, టైప్ 2 మధుమేహం కూడా ఉందని వైద్యులు తెలిపారు. మెక్సికోలోని పౌల్ట్రీలో H5N2 నివేదించబడినప్పటికీ, బాధితుడికి ఎలా సోకుతుందో స్పష్టంగా తెలియదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.


US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. 2021లో చైనాలో 18 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. బాధితుడి నివాసానికి సమీపంలో ఉన్న పొలాలను పరిశీలిస్తున్నామని.. రోగితో పరిచయం ఉన్న వారికి బర్డ్ ఫ్లూ సోకలేదని అధికారులు నిర్ధారించారు. ప్రారంభ పరీక్షల్లో ఇన్‌ఫ్లూయెంజాగా సోకినట్లు తెలియలేదని కనిపించింది, కొన్నాళ్లకు అతని రక్త నమూనాల్లో H5N2 ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు చెప్పారు. మెక్సికోలో ఈ వైరస్‌తో ప్రమాదం తక్కువగా ఉందని, మృతుడి చుట్టు పక్కల వారిని పరీక్షించినప్పటికీ కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదని వెల్లడించారు.


బర్డ్‌ ఫ్లూను ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఇది సాధారణంగా పక్షులు, కోళ్లకు సోకుతుంది. ఇన్‌ఫ్లూయంజా టైప్‌-ఏలో 12 కుపైగా వైరస్‌లు ఉండగా హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన బర్డ్‌ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీ కోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ H5N1రకాన్ని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997లో తొలిసారి గుర్తించింది. భారత్‌లో మాత్రం ఈ వైరస్‌ 2006లో బయటపడింది. భారత్‌లో ఉండే అనువైన వాతారణం దృష్ట్యా ఏటా వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుందని నిపుణులు వెల్లడించారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఇతర పక్షులకు, జంతువులతో పాటు మానవులకు వైరస్‌ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. వ్యాధి సోకిన వారు అప్రమత్తంగా ఉండి, సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 08:06 AM