Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Jul 13 , 2024 | 10:29 AM

Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Latest News

Live News & Update

  • 2024-07-13T21:52:08+05:30

    • రెయిన్ అప్ డేట్

    • రంగారెడ్డి జిల్లాలో వర్షం

    • చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో వాన

    • సిటీలో పలు చోట్ల వర్షం

  • 2024-07-13T20:47:42+05:30

    గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’

    • హైదరాబాద్: గౌడ సోదరుల కోసం ‘కాటమయ్య రక్ష’ కిట్లు

    • అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలం లష్కర్‌‌గూడ గ్రామంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభం.

    • గౌడన్నలతో సమావేశం తర్వాత వారితో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

    • తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ

    • చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న గీత కార్మికులు

    • ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్‌ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ సేప్టీ కిట్ల తయారీ

    • గీత కార్మికులు సులువుగా తాళ్లు ఎక్కేలా కిట్ల రూపకల్పన

    • ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి పడకుండా అత్యాధునిక టెక్నాలజీ వినియోగం

    • ఒక్కో కిట్‌లో ఆరు పరికరాలు. తాడు, క్లిప్పు, హ్యాండిల్స్‌, స్లింగ్ బ్యాగ్, లెగ్‌ లూప్ ఉంటాయి.

    • గీత కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలో, యూజర్ ఫ్రెండ్లీగా పరికరాలు

  • 2024-07-13T20:24:08+05:30

    తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • అమరావతి: ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించే చర్యలు

    • విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణ వేత్త ఈఏఎస్ శర్మ ఫిర్యాదు

    • కంప్లైంట్‌పై జీవీఎంసీ అధికారులను వివరణ కోరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని ఈఏఎస్ శర్మ లేఖ,

    • వందలాది మంది ప్రజల సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతం,

    • జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతోందని వార్తలు

    • ముడసర్లోవ పార్కును పరిరక్షించాలని కోరుతూ లేఖలో శర్మ ప్రస్తావన.

    • తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్.. జీవీఎంసీ అధికారుల వివరణ కోరిన డిప్యూటీ సీఎం.

    • అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని పవన్ కళ్యాణ్‌కు వివరించిన అధికారులు

  • 2024-07-13T20:13:59+05:30

    బీఆర్ఎస్‌కు మరో షాక్

    • హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    • కాంగ్రెస్ పార్టీలోకి పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

    • స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిన చేరిక

    • మధ్యాహ్నం దానం నాగేందర్‌తో భేటీ తర్వాత స్పష్టత

    • స్థానిక నేతలకు నచ్చజెప్పిన దానం నాగేందర్

    • సీఎం రేవంత్ ఇంటికి మహిపాల్ రెడ్డి

  • 2024-07-13T19:56:20+05:30

    పశు పోషకులకు రాయితీలు: మంత్రి అచ్చెన్నాయుడు

    • అమరావతి: పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు: రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధకశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

    • పశు పోషకులకు 90 శాతం రాయితీపై షెడ్ల నిర్మాణం.

    • గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లకు 70 శాతం రాయితీ.

    • గరిష్ఠంగా యూనిట్‌కు రూ.2.3 లక్షలు.

    • వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి.

  • 2024-07-13T19:44:24+05:30

    ఒకటో తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటే

    • హైదరాబాద్: ఒకటో తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటే: మాజీ మంత్రి హరీశ్ రావు

    • 13 రోజులు గడిచినా మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్‌కు జీతాలు వేయలేదు

    • ఔట్ సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్స్‌కు కూడా జీతాలు పడలే

    • ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాల పొడిగింపు జులై 31 వరకు ఇవ్వడం సరికాదు

    • మేనిఫెస్టోలో చెప్పినట్టుగా గెస్ట్ లెక్చరర్స్‌కు రూ.42 వేల వేతనం ఇవ్వాలి.

  • 2024-07-13T19:32:42+05:30

    జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై టెలీ కాన్ఫరెన్స్

    • అమరావతి: ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు: జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

    • 10 రోజులపాటు నాలుగో విడత సభ్యత్వ నమోదు

    • ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ

    • పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు సమిష్టిగా పనిచేద్దామని పిలుపు

  • 2024-07-13T18:47:41+05:30

    భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

    • అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

    • 37 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు

    • జీవో జారీ చేసిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్

    • కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా బదిలీ

    • వకుల్ జిందాల్ విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ

    • ఎం దీపిక అనకాపల్లి ఎస్పీగా బదిలీ

    • వి రత్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ

    • ఎస్వీ మాధవ్ రెడ్డి పార్వతీపురం ఎస్పీగా బదిలీ

  • 2024-07-13T18:30:15+05:30

    • హెచ్ఐసీసీలో గ్లోబల్ ఆర్టిఫిషీయల్ సదస్సు

    • గ్లోబల్ ఆర్టిఫిషీయల్ సదస్సు లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

    • సెప్టెంబర్ 5,6 తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలో సదస్సు

    • హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

  • 2024-07-13T17:49:48+05:30

    ఉపఎన్నికల్లో ఇండియా కూటమి - 10, ఎన్డీయే - 2

    • దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.

    • 10 చోట్ల విజయం సాధించిన ఇండియా కూటమి అభ్యర్ధులు, 2 చోట్ల బీజేపీ అభ్యర్థులు ,1 చోట స్వాతంత్య్ర అభ్యర్థి.

    • హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్ర, నలగార కాంగ్రెస్ విజయం, హమీర్ పూర్ బీజేపీ విజయం.

    • బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వంతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయం.

    • మధ్యప్రదేశ్‌లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ విజయం.

    • పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం.

    • తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి విజయం.

    • ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ (లా₹క్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) కాంగ్రెస్ అభ్యర్థులు విజయం.

    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ స్వీప్.

    • నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీఎంసీ.

    • వెస్ట్ బెంగాల్ లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం.

  • 2024-07-13T17:23:06+05:30

    వైసీపీ నేతలను దారుణంగా ఆడుకున్న వైఎస్ షర్మిల..

    • పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉంది వైసీపీ నేతల తీరు: వైఎస్ షర్మిల

    • సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే.. బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం.

    • వైసీపీ నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే.. మేము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి.

    • తల్లికి వందనం GO 29 క్లారిటీ లేదని, సాక్షి రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని,

    • ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేస్తే ..

    • కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది?

    • మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది.

    • ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుంది?

    • వైసీపీ నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా?

    • ఆ ముక్క పట్టుకొని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా?

    • అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా?

    • అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోంది. ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా?

    • నేను వైసీపీ కోసం బై బై బాబు కాంపెయిన్ చేయడం ఎంత నిజమో.. అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు రూ. 15000 చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజం.

    • మరి మీకు 15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు?

    • మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు?

    • సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని.. జలయజ్ఞం పూర్తి చేస్తాం అని..

    • ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు కాంపెయిన్ చేయించారు?

    • మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా ?

  • 2024-07-13T16:30:43+05:30

    జనసేన నేతల కొట్లాట.. పార్టీ సీరియస్..

    janasena.jpg

    • అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన నేతల మధ్య కొట్లాట జరిగింది.

    • ఈ వివాదంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది.

    • నడి రోడ్డుపై ఘర్షణకు దిగిన ఎన్ఆర్ఐ వెంకటపతి రాజా, రాజోలు నియోజకవర్గ జనసేన నేతలు.

    • దిరసాల బాలాజీ, పినిశెట్టి బుజ్జిల మధ్య సయోద్య కుదిర్చిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.

    • వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ప్రజలు కోసం పనిచేస్తామని ప్రకటించిన నేతలు.

  • 2024-07-13T16:17:29+05:30

    60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం: మంత్రి అచ్చెన్న

    • 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం.

    • ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.

    • ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF)కు “గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటి” అవార్డు వచ్చిన సంధర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు.

    • రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 60 లక్షల మందికి ఈ విధానం చేరువ చేయాలన్న సంకల్పంతో ఉన్నాం.

    • APCNF చేస్తున్న కృషిని, పనితీరును గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు పోర్చుగల్‌కు చెందిన “కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్” కు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి.

    • ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 508 ఎంట్రీలలో APCNF ఎంపిక కావడం చెప్పుకోదగ్గ విషయం.

    • రైతుల సంక్షేమంతో పాటు క్త్లెమేట్ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకొని 2016 వ సంవత్సరంలో మేము APCNF ప్రకృతి వ్యవసాయ మోడెల్‌కు గ్లోబల్ స్థాయి గుర్తింపు రావడం అత్యంత ఆనందంగా ఉంది.

    • APCNF తరపున ప్రకృతి వ్యవసాయ మార్గంలో ప్రయాణిస్తున్న 10 లక్షల మంది రైతుల ప్రతినిధిగా నాగేంద్రమ్మ ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది.

  • 2024-07-13T16:12:17+05:30

    తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు: నిమ్మల రామానాయుడు

    • వైకాపాలా ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుంది.

    • ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాoటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం.

    • ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం.

    • ఓ పండుగ వాతావరణం లోనే తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతాం.

    • అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైకాపా పేటంట్ పొందింది.

    • 2019లో వచ్చిన మూడంకెల సీట్లు 2024లో డబల్ డిజిట్ కు పడిపోయునా వైకాపా కు బుద్దిరాలేదు.

    • ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకుండానే ఫించన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విషప్రచారం మొదలుపెట్టిన వైకాపాకి ఈసారి సింగిల్ డిజిటే అని స్పష్టమవుతోంది.

    • ఆమ్మఒడి ఇద్దరు పిల్లలు ఉన్నా ఇస్తామని హామీ ఇచ్చి మాటతప్పి మడమ తిప్పింది జగన్ కాదా?.

    • మేం ఇంకా తల్లికి వందనం విధి విధానాలు రూపొందించక ముందే అసత్యాలు మొదలుపెట్టారు.

    • ఆమ్మఒడి ని మోసం, దగాతో కేవలం 4సార్లు మాత్రమే ఇచ్చి ప్రతీ ఏటా ఇస్తానన్న మొత్తం కూడా కుదించేశారు.

    • ఆమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైకాపా నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.

  • 2024-07-13T16:08:18+05:30

    చేనేత కార్మికులకు మరణశాసనం రాశారు జగన్: మంత్రి సవిత

    • కృష్ణాజిల్లా గూడూరు మండలం పోలవరం గ్రామంలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన చేనేత జౌళిశాఖ, బీసీ సంక్షేమం, ఈబిసి మంత్రి సవిత.

    • చేనేత సహకార సంఘాల గోదాములలో నేసిన వస్త్రాలను పరిశీలించారు మంత్రి.

    • చేనేత కార్మికులు నా కుటుంబం.. నారా లోకేష్ నాపై చాలా పెద్ద భాధ్యత పెట్టారు అని అన్నారు.

    • చేనేత సంఘాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.

    • కార్మిక సంఘాలను బలోపేతం చేస్తాం

    • చేనేత సహకార సంఘాల కార్మికులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

    • ఆప్కో కుంభకోణంపై చేనేత, జౌళి శాఖ బీసీ సంక్షేమ ఈ బీసీ మంత్రి స్పందించారు.

    • ఆప్కోలో రూల్స్ విరుద్ధంగా పనిచేసిన అధికారులను, వైఎస్ఆర్సిపీ పార్టీ రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం.

    • ఎంక్వయిరీ వేసి దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

  • 2024-07-13T14:55:25+05:30

    ఎమ్మెల్యేలు పార్టీ మారడం బాధాకరం: బోయినపల్లి వినోద్

    • కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉంది.

    • అదే షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయిల్ రిఫేనరీ కంపెనీనీ ఏపీకి ఇస్తున్నారు.

    • మరి తెలంగాణకు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చడం లేదు.

    • ఏపీలో ప్రాంతీయ పార్టీని గెలిపించారు కాబట్టే అక్కడ పెట్రో రైఫెనరీ కంపెనీ వచ్చింది.

    • కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మీద ఆధారపడ్డది కాబట్టే అక్కడ హామీలు నెరవేరుస్తున్నారు.

    • కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీనీ ఏర్పాటు చేయండి.

    • ఎమ్మేల్యేలు పార్టీ మారడం బాధాకరం.

    • ఎంతమంది మారిన మేము పట్టించుకోం.

    • కొత్త తరాన్ని తయారు చేస్తాం.

  • 2024-07-13T14:52:43+05:30

    నిజామాబాద్: రైల్వే స్టేషన్‌ సమీపంలో రెండు మృతదేహాలు

    • ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యం.

    • రైల్వే ట్రాక్ పక్కన డ్రైనేజీలో పడి ఉన్న మృతదేహాలు.

    • రాత్రి సమయంలో నడుస్తున్న రైలు నుంచి పడి మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్న రైల్వే పోలీసులు.

  • 2024-07-13T14:51:21+05:30

    గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: డీజీపీ ద్వారకా తిరుమలరావు

    • అనంతపురం, కర్నూలు రేంజ్ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది.

    • నేరాలను అదుపు చేయడం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాం.

    • ప్రతి జిల్లాలో సవాళ్ళను ప్రతి సవాళ్ళను పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కోంటున్నాం.

    • పోలీసు డిపార్ట్మెంట్‌లో వాహనాలు పాతబడ్డాయి.

    • వాటిని అప్ గ్రేడ్ చేయడం జరుగుతుంది.

    • కింది స్థాయి సిబ్బందికి వెల్ఫేర్ ఇచ్చేందుకు కృషి చేస్తాం.

    • పౌరులకు మెరుగైన సేవలందించి, పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.

    • చట్టాన్ని గౌరవించాలి.

    • గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.

    • పోలీసులు పనితీరును పెంపోందించుకుని మెరుగు పరుచుకోవాలి.

    • అమాయక గిరిజనులను వాడుకుని గంజాయి సాగు చేయిస్తున్నారు.

    • దానిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే అరికడతామం.

    • యాంటీ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అరికడతాం.

    • ఎర్రచందనం అక్రమ రవాణాపై రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది.

    • ప్రస్తుతం గంజాయిపై ఎక్కువ ఫోకస్ పెట్టాం.

    • ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనపై అవగాహన కల్పించాం.

    • మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతాం.

  • 2024-07-13T14:48:28+05:30

    లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోరీ..

    • తూర్పుగోదావరి జిల్లా: కోరుకొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో దొంగతనం.

    • నరసింహస్వామి గుడి మెట్ల దగ్గర ఉన్న హుండీలోని నగదును దొంగిలించిన గుర్తు తెలియని దుండగులు.

    • సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకున్న కోరుకొండ పోలీసులు.

  • 2024-07-13T14:43:49+05:30

    అనంత్ అంబానీ పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సెలబ్రిటీస్..

    అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలో సెలబ్రిటీలు ఫుల్ ఖుషీ చేశారు. డ్యా్న్స్ చేస్తు, పాటలు పాడుతూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • 2024-07-13T14:25:00+05:30

    వైఎస్ షర్మిల టీడీపీకి కొమ్ముగాయలేదు: ఏపీసీసీ సీనియర్ లీడర్ మస్తాన్ వలీ

    • తల్లికి వందనం పథకం మీద అధ్యక్షురాలిగా కూటమి సర్కార్‌ను ప్రశ్నించారు.

    • గత ప్రభుత్వం కూడా మోసం చేసింది అని చెప్పారు.

    • ఉన్న మాట చెప్తే జగన్ పార్టీకి ఉలుకు ఎందుకు.

    • షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు.

    • అభూత కల్పనలు సృష్టిస్తున్నారు.

    • షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు.

    • ఊహాజనిత మాటలు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.

    • కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లగక్కారు.

    • ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని జగన్ అనలేదా ?

    • ఇద్దరు పిల్లలకు ఇస్తామని మీరు మాట ఇవ్వలేదా ?

    • షర్మిల చేత మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పించలేదా.

    • సమాధానం చెప్పకుండా మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు.

    • టీడీపీకి తొత్తుగా ఉండాల్సిన అవసరం మాకు లేదు.

    • టీడీపీకి బి టీమ్‌గా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్‌కి లేదు.

    • తొత్తులుగా బీజేపీ పంచన చేరింది మీరే.

    • వైసీపీ, బీజేపీకి ఒక తొత్తు పార్టీ.

    • స్పీకర్ ఎన్నికల్లో సైతం వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది.

    • అమ్మకు వందనం పథకం బాబు అందరికీ ఇవ్వాలని మా అధ్యక్షురాలు డిమాండ్ చేశారు.

    • కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రజల పక్షం.

    • అమ్మఒడి పథకం ప్రకటనలో ఇద్దరి పిల్లలకు అని హామీ ఇచ్చారు.

    • ఇంట్లో ఇద్దరి పిల్లలకు అని చెప్పాడు.

    • ఇది నిజం కాదా ? సమాధానం చెప్పాలి.

    • మాపై సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

    • దమ్ముంటే మీరు ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పలేదా?.

  • 2024-07-13T14:15:37+05:30

    ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి హవా.. ఎన్డీయే డీలా..

    • దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.

    • హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్ర, నలగార కాంగ్రెస్ విజయం, హమీర్ పూర్ స్థానంలో బీజేపీ విజయం.

    • బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వంతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ ముందంజ.

    • మధ్యప్రదేశ్‌లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ ముందంజ.

    • పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం.

    • తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ ముందంజ.

    • ఉత్తరాఖండ్‌లో బీజేపీ షాక్.

    • ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ (లాక్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) ముందంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు.

    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ స్వీప్.

    • నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీఎంసీ.

    • వెస్ట్ బెంగాల్‌లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం.

  • 2024-07-13T13:05:29+05:30

    పోలవరం వద్ద పోటెత్తిన్న గోదావరి..

    polavaram-2.jpg

    • ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద పోటెత్తుతున్న గోదావరి వరద.

    • ప్రాజెక్టు ప్రాంగణాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద.

    • స్పిల్ వే ఎగువన 27.160 మీటర్లు.

    • స్పిల్ వే దిగువన 17.230 మీటర్లు నీటిమట్టం నమోదు.

    • కాపర్ డ్యాం ఎగువన 27.190 మీటర్లు.

    • కాపర్ డ్యాం దిగువన 16.230 నీటిమట్టం నమోదు.

  • 2024-07-13T13:01:09+05:30

    మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

    • మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్‌పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి శృతి(25).

    • స్థానికులు గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం యువతిని మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలింపు.

    • తీవ్ర రక్త స్రవంతో ఉన్న యువతి అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు.

    • హాస్పిటల్ కి చేరుకున్న పోలీసులు.

    • యువతి డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని చెబుతున్న పోలీసులు.

    • కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు.

  • 2024-07-13T12:59:37+05:30

    హైదరాబాదులో వెలుగు చూసిన మరో భారీ మోసం

    • కోట్ల రూపాయల వసూలు చేసి బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ సంస్థ.

    • జాగృతి కన్సల్టెంట్ బాధితుల ఆందోళన.

    • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు.

    • ఉద్యోగాలు ఇస్తామని ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసిన జాగృతి యాజమాన్యం.

    • ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది.

    • 1200 మందికి అవకాశం కల్పించి ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న జాగృతి సంస్థ.

    • జాగృతి కన్సల్టెంట్ డైరెక్టర్ జగదీశ్.

    • మొత్తం రూ. 24 కోట్లు వసూలు చేసిన జాగృతి డైరెక్టర్ జగదీశ్.

  • 2024-07-13T12:51:54+05:30

    ప్లీజ్.. నా కాళ్లు మొక్కొద్దు.. చంద్రబాబు విజ్ఞప్తి..

    • తన కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.

    • తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలి.

    • నాయకుల కాళ్లకు ప్రజలు దండాలు పెట్టే విధానం వద్దు.

    • పార్టీ కార్యాలయంలో ప్రజలను కలిసే సమయంలో చంద్రబాబు కాళ్లకు మొక్కిన పలువురు.

    • దీనితో తన కాళ్ళకు మొక్కవద్ధని విజ్ఞప్తి చేసిన చంద్రబాబు.

    • ఈ రోజు నుంచి ఎవరు అలా చేయవద్దని స్పష్టం చేసిన చంద్రబాబు.

    • సెక్యూరిటీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసిన పార్టీ నేతలు.

    • నా కాళ్ళకు ఎవరైనా దండం పెడితే మరల నేను వారి కాళ్ళకు దండం పెడతాను అని చెప్పిన సీఎం.

  • 2024-07-13T12:42:10+05:30

    చీరాలలో ఆర్టీసి బస్సుకి తృటిలో తప్పిన ప్రమాదం..

    ముంతావారి సెంటర్ వద్ద రన్నింగ్‌లో ఊడిపోయిన బస్సు ముందు టైర్.

    ఘటన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు.

    బస్సు వేగం తక్కువగా ఉండటంతో తప్పిన ప్రమాదం.

    ఇంకొల్లు నుండి చీరాలకు వస్తుండగా ఘటన.

  • 2024-07-13T12:36:56+05:30

    ఉపఎన్నికల్లో ఇండియా కూటమి హవా..

    • పంజాబ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆప్ విజయం.

    • జలందర్ వెస్ట్ స్థానంలో విజయం సాధించిన ఆప్ అభ్యర్థి మోహిందర్ భగత్.

    • సంబరాలు జరుపుకుంటున్న ఆప్ కార్యకర్తలు.

  • 2024-07-13T12:34:37+05:30

    సోమశిల డ్యామ్ నిర్వహణను గాలికి వదిలేసిన జగన్ సర్కార్..

    • నెల్లూరు జిల్లాకి తలమానికమైన సోమశిల డ్యాం నిర్వహణని అయిదేళ్లుగా గాలికి వదిలేసిన జగన్ ప్రభుత్వం.

    • కనీసం గ్రీజు, జనరేటర్‌కి అవసరమైన డీజిల్‌కి కూడా నిధులు కేటాయించని జగన్ ప్రభుత్వం.

    • వరదల తాకిడికి పూర్తిగా ధ్వంసమైన అప్రాన్ ప్రాంతం. ఎర్త్ డ్యామ్, సిల్ప్‌వే, జనరల్ మెయింటెన్స్‌కి సిబ్బంది కరువు.

    • కనీసం 12 మంది వాచ్ మెన్లలో ఒక్కరినీ నియమించని జగన్ ప్రభుత్వం.

    • తుపాను సమయంలో డీజిల్‌కి డబ్బులు లేక రైతుల ట్రాక్టర్లలో డీజిల్ సేకరణ.

    • సోమశిల డ్యాంని గతంలో రెండు సార్లు పరిశీలించిన కేంద్ర బృందాలు.

    • డ్యాంకి తీవ్ర ప్రమాదం తప్పదని హెచ్చరించిన కేంద్ర బృందాలు.

    • కేంద్ర బృందాల హెచ్చరికలని పట్టించుకోని జగన్ ప్రభుత్వం‌.

    • రోప్ నిర్మాణాలకి కూడా రూ.1.5కోట్లు కేటాయించని జగన్ ప్రభుత్వం.

    • వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న సోమేశ్వరాలయం గురించీ పట్టించుకోని జగన్ ప్రభుత్వం.

    • రేపు సోమశిల డ్యాంని పరిశీలించనున్న మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ.

    • సోమశిల డ్యాంని కాపాడేందుకు అవసరమైన తక్షణ చర్యలపై కూటమి ప్రభుత్వం కసరత్తు.

  • 2024-07-13T11:34:57+05:30

    విశాఖ: ముచ్చుమర్రి మైనర్ బాలిక ఘటనపై హోం మంత్రి సమీక్ష.

    • డీజీపీతో మాట్లాడి తాజా పరిస్థితిపై ఆరా.

    • ప్రత్యేక బృందాలను రంగలోకిదింపి విచారణ వేగవంతం చెయ్యాలని ఆదేశం.

    • శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన హోంమంత్రి.

  • 2024-07-13T11:13:46+05:30

    దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

    • దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.

    • హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్ర, అమీర్ పూర్, నలగర్‌లో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థులు.

    • బీహార్‌లోని రూపౌళి జెడియు అభ్యర్థి ముందంజ.

    • మధ్యప్రదేశ్‌లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి ముందంజ.

    • పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ ఆమ్ ఆద్మీ అభ్యర్థి ముందంజ

    • తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ డీఎంకే అభ్యర్థి ముందంజ.

    • ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూర్‌లో కాంగ్రెస్ ముందంజ.

    • వెస్ట్ బెంగాల్‌లోని రాయిగంజ్, రణఘాట్ దక్షిణ, బాగ్ద, మాణిక్తలాలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ.

  • 2024-07-13T11:10:09+05:30

    దేవాలయాల్లో కూడా రాజకీయాలు: జస్టిస్ ఎన్వీ రమణ

    • అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టటం శుభ సంకేతం.

    • దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి, ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశాం.

    • దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలో మార్గం సుగమమైంది.

    • సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యం.

    • ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతో పాటు ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోంది.

    • రానున్న రోజుల్లో అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించుడటం శుభపరిణామం.

    • అక్షయపాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చింది.

    • ఎవరూ అర్థాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతోమందికి అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేస్తోంది.

  • 2024-07-13T10:45:48+05:30

    కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..

    • కర్నూలు బళ్ళారి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.

    • తల్లి కూతుళ్లు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ

    • తల్లి సోమేశ్వరమ్మ మృతి.

    • కూతురు ప్రశాంతి పరిస్థితి విషమం.

    • ఆసుపత్రికి తరలింపు.

  • 2024-07-13T10:44:28+05:30

    పాలకొల్లులో డయాలసిస్ సెంటర్: మంత్రి నిమ్మల రామానాయుడు

    • పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి రెండు జాతీయ రహదారుల మధ్యలో ఉంది.

    • ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమైనది.

    • ఏడాది కాలంలో పూర్తి కావాల్సిన 100 పడకల ఆసుపత్రిని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కూడా పూర్తి చేయలేకపోయింది.

    • పాలకొల్లు నూతన ఆసుపత్రి నిర్మాణంలో తీవ్ర లోపాలు ఉన్నాయి.

    • భవనం లోపలా పైనా కూడా నీరు నిలిచిపోయింది.

    • వైసీపీ విధ్వంస పాలనకు, ఈ నాణ్యతా లోపం పనులకు ఈ భవన నిర్మాణమే నిదర్శనం.

    • జరిగిన తప్పిదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు.

    • పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.

  • 2024-07-13T10:29:05+05:30

    బీర్ఎస్‌‌కు వరుస షాక్..

    • మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

    • నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

    • సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్న గాంధీ

    • ఉదయం 10గంటలకు జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్న అరికపూడి గాంధీ

    • అరికపూడి గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పలువురు కార్పోరేటర్లు, నేతలు

    • రేపు కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు.