Share News

Odisha: విద్యార్థులకు అస్వస్థత.. దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఏర్పాటు

ABN , Publish Date - Aug 09 , 2024 | 11:35 AM

మధ్యాహ్నం భోజనం తిని దాదాపు 100 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. ఆ క్రమంలో వాంతులు, ఛాతీ నొప్పితో వారంతా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. దాంతో వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి.. వైద్య చికిత్స అందించారు.

Odisha: విద్యార్థులకు అస్వస్థత.. దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఏర్పాటు

భువనేశ్వర్, ఆగస్ట్ 09: మధ్యాహ్నం భోజనం తిని దాదాపు 100 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. ఆ క్రమంలో వాంతులు, ఛాతీ నొప్పితో వారంతా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. దాంతో వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి.. వైద్య చికిత్స అందించారు. ఈ ఘటన ఒడిశా బాలసోర్ జిల్లాలోని సిరప్పూర్ గ్రామంలో ఉదయ్ నారాయన్ నోడల్ స్కూల్‌లో చోటు చేసుకుంది. అయితే ఆ ఆహారంలో చనిపోయిన బల్లి పడి ఉండడాన్ని ఆ తర్వాత విద్యార్ధులు గుర్తించారు. ఈ ఘటనపై బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: Bangladesh Violance: బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన 7,200 మంది భారతీయ విద్యార్థులు

food poision.jpg


భువనేశ్వర్‌లో రైస్ ఏటీఎం ఏర్పాటు

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రైస్ ఏటీఎంను ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమం మంత్రి కృష్ణ చంద్ర పాత్ర గురువారం ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ కార్డు దారుడు 25 కేజీల వరకు బియ్యాన్ని ఈ ఏటీఎం ద్వారా పొందవచ్చునని తెలిపారు. బయోమెట్రిక్ చేసి.. అనంతరం ఏటీఎం టచ్ స్క్రీన్‌పై రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి.. బియ్యం నేరుగా పొందవచ్చునని చెప్పారు.

Also Read: wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?

rice.jpg


రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూలు తగ్గించేందుకు ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే నిజమైన లబ్దిదారులు మాత్రమే ఈ బియ్యం తీసుకునే వీలు కలుగుతుందన్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న బియ్యాన్ని సైతం అరికట్టవచ్చునని చెప్పారు. కొలతల్లో సైతం ఎటువంటి తేడా కానీ, మోసాలు కానీ ఉండవని స్పష్టం చేశారు.

Also Read: Independence Day 2024: ఆగస్ట్ 15 వేళ.. బీజేపీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం


పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఏటీఎం ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఇదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఈ తరహా ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ రైస్ ఏటీఎంలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తే.. దేశ ప్రజలు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చునని మంత్రి కృష్ణ చంద్ర పాత్ర అభిప్రాయపడ్డారు. ఒక దేశం, ఒక రేషన్ పథకం ద్వారా రేషన్ కార్డు లబ్దిదారులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

Laapataa Ladies' Movie: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ చిత్ర ప్రదర్శన.. హాజరుకానున్న ఆమిర్ ఖాన్ దంపతులు

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 11:35 AM