Share News

Jyotirmath Shankaracharya: కేదార్‌నాథ్ ఆలయం నుంచి 228 కేజీల బంగారం మాయం?

ABN , Publish Date - Jul 15 , 2024 | 07:15 PM

దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ పీఠాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం నుంచి 228 కిలోల బంగారం మాయమైందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. కేదార్‌నాథ్‌లో 'గోల్డ్ కుంభకోణం' జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

Jyotirmath Shankaracharya: కేదార్‌నాథ్ ఆలయం నుంచి 228 కేజీల బంగారం మాయం?

ముంబై: దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ పీఠాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ (Kedarnath) ఆలయం నుంచి 228 కిలోల బంగారం (Gold) మాయమైందని (Missing) జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ (Swami Avimukteshwaranand) తెలిపారు. కేదార్‌నాథ్‌లో 'గోల్డ్ కుంభకోణం' (Gold Scam) జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

Shakaracharya: వంచనకు గురైన ఉద్ధవ్... జ్యోతిర్మఠం శంకరాచార్య సంచనల వ్యాఖ్యలు


''కేదార్‌నాథ్‌లో గోల్డ్ స్కామ్ జరిగింది. ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదు? అక్కడ ఒక కుంభకోణం జరిగిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ నిర్మిస్తామని అంటున్నారు. అప్పుడు మరో స్కామ్‌ జరుగుతుంది. కేదార్‌నాథ్ నుంచి 288 కిలోల బంగారం మాయమైంది. దానిపై ఎలాంటి ఎంక్వయిరీ ప్రారంభం కాలేదు. దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు ఢిల్లీలో మరో కేదార్‌నాథ్ నిర్మిస్తామంటున్నారు. ఇది జరక్కూడదు'' అని అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అన్నారు. ఢిల్లీలో మరో కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనల్లో కేదార్‌నాథ్ ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఢిల్లీలో జూలై 10న జరిగిన ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు.

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 07:19 PM