Share News

Top 8 Floods India: దేశాన్ని కుదిపేసిన 8 ప్రధాన వరద సంఘటనలు..10 వేల మంది మృతి!

ABN , Publish Date - Aug 02 , 2024 | 09:24 PM

ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో(india) ఏదో ఒక చోట వరదలు(floods), విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రధాన ఎనిమిది వరదల సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 8 Floods India: దేశాన్ని కుదిపేసిన 8 ప్రధాన వరద సంఘటనలు..10 వేల మంది మృతి!
Top 8 Floods India

ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో(india) ఏదో ఒక చోట వరదలు(floods), విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ముంబై, చెన్నై వంటి కీలక నగరాల్లో కూడా వరదల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఏడాది కూడా కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ప్రకృతి భీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రధాన ఎనిమిది వరదల సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ క్రమంలో 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం విశేషం.


కేదార్‌నాథ్ విషాదం (2013)

2013లో ఉత్తరాఖండ్‌లోని కేదానాథ్‌లో భారీ వర్షాల కారణంగా చోరాబరి సరస్సు ఆకస్మాత్తుగా పొంగిపొర్లింది. దీంతో దాని పరిధిలోని అనేక ఇళ్లు, భారీ శిధిలాలు, రాళ్లు కూప్ప కూలిపోయాయి. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో 4700 మంది యాత్రికులు మరణించారు. ఐదు వేల మందికి పైగా గల్లంతయ్యారు.

మురికివాడల విపత్తు (2014)

2014లో పూణెలోని మాలిన్ గ్రామంలో పర్వతాలకు పగుళ్లు రావడంతో భారీ విధ్వంసం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు గ్రామం మొత్తం శిథిలాల కింద కూరుకుపోయింది. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి పదేళ్లు.


కశ్మీర్ వరదలు (2014)

2014లో కశ్మీర్‌లో కూడా వరదలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ విపత్తులో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా వరద బీభత్సం సృష్టించింది. జీలం నది నీరు శ్రీనగర్‌ను ముంచెత్తింది.

కేరళ వరదలు (2018)

ఇటివల వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. అయితే ఇంతకు ముందు 2018లో కూడా కేరళ ఇలాంటి విపత్తును ఎదుర్కొంది. 2018లో కేరళలో శతాబ్దపు అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. ఆ వరదల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు రెండు లక్షల మంది నిర్వాసితులుగా మిగిలారు. దాదాపు 14 జిల్లాల్లో ఈ వరద ఉధృతి కనిపించింది.


చెన్నై వరదలు (2015)

తమిళనాడు రాజధాని చెన్నైలో డిసెంబర్ 1, 2015న ప్రకృతి భయానక రూపాన్ని ప్రదర్శించింది. దక్షిణ భారతదేశంలోని ఈ నగరం భారీ వర్షంతో మునిగిపోయింది. చెన్నైలో ఒక్కరోజులోనే 494 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరదల్లో వందలాది మంది చనిపోయారు.

అసోం వరదలు (2012)

ఈశాన్య రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రమైన అసోం ప్రతి సంవత్సరం వరదల కారణంగా వినాశనాన్ని ఎదుర్కొంది. అయితే 2012లో వచ్చిన వరదను ఎవరూ మరిచిపోలేదు. జూన్ 26, 2012న అసోంలో భారీ వర్షాల కారణంగా, రాష్ట్రంలోని మొత్తం 27 జిల్లాలు వరదలకు గురయ్యాయి. వరదల్లో దాదాపు 120 మంది చనిపోయారు. 22 లక్షల మంది ప్రభావితమయ్యారు.


ముంబై వరదలు (2005)

2005 జులై 26న దేశ ఆర్థిక రాజధాని ముంబైని ముంచెత్తిన వరదను ఎవరు మర్చిపోలేదని చెప్పవచ్చు. వరద ముంబయి అంతటా అల్లకల్లోలం సృష్టించింది. వరదల్లో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

వాయనాడ్ వరదలు (2024)

ఈ ఏడాది జులై 30, 2024న రాత్రి కేరళలోని వాయనాడ్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో రెండు కొండచరియలు విరిగిపడటంతో నాలుగు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. 74 మృతదేహాలను గుర్తించలేకపోయారు.


Also Read:

Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. కారణమిదే..


Deepinder Goyal: అంబానీ, అదానీ కాదు.. నిమిషాల్లోనే రూ.1600 కోట్లు సంపాదించిన మరో ఇండియన్

Paris Olympics 2024: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించిన భారత్


Manu Bhaker: మను భాకర్ ఒలింపిక్ విక్టరీ తర్వాత క్యూ కట్టిన 40కిపైగా బ్రాండ్స్.. ఇక ఆదాయం ఏంతంటే..

For Latest News and National News Click Here

Updated Date - Aug 02 , 2024 | 09:24 PM