Share News

Delhi : 2036 కల్లా దేశ జనాభాలో 65% మంది పనిచేయగల వయస్సు వారే

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:39 AM

భారతదేశంలో పనిచేయగలిగిన వయస్సు(15-64) కలిగిన జనాభా సంఖ్య 2036వరకు పెరుగుతుందని ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) నివేదిక పేర్కొంది. 2011 నాటికే భారత్‌లో 60% మంది పనివయసు జనాభా ఉందని....

Delhi : 2036 కల్లా దేశ జనాభాలో 65% మంది పనిచేయగల వయస్సు వారే

న్యూఢిల్లీ, ఆగస్టు 3: భారతదేశంలో పనిచేయగలిగిన వయస్సు(15-64) కలిగిన జనాభా సంఖ్య 2036వరకు పెరుగుతుందని ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) నివేదిక పేర్కొంది. 2011 నాటికే భారత్‌లో 60% మంది పనివయసు జనాభా ఉందని, ఇది 2031 నాటికి 65.1 శాతానికి చేరుతుందని పేర్కొంది.

అయితే, 2036 నాటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 64.9 శాతానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇదేసమయంలో చైనా, జపాన్‌లలో పనివయసు జనాభా తగ్గుముఖం పడుతోందని తెలిపింది. పనివయసు జనాభా పెరుగుదల కారణంగా శ్రామిక శక్తి వృద్ధి చెందుతుందని, ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని నివేదిక వివరించింది.

ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో వలసలు, మానవ వనరుల మూలధన పెట్టుబడులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ప్రస్తుతం పలు దేశాల్లో పనివయసు జనాభా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా దేశాలు మరిన్ని విధానాలు అవలంభించాల్సి వస్తోందని పేర్కొంది. అయితే, ఆసియా, పసిఫిక్‌ దేశాలు మాత్రం పనివయసు జనాభాను సమతుల్యం చేయడంతో పాటు వారిని సరైన విధంగా వినియోగించుకునేందుకు నూతన విధానాలను అవలంభించాల్సి ఉంటుందని ఏడీబీ వివరించింది.

Updated Date - Aug 04 , 2024 | 05:39 AM