Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Pawan Singh: బీజేపీకి పెద్ద షాక్.. పోటీ చేయలేనంటూ తప్పుకున్న నటుడు.. కారణమిదే!

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:26 PM

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) 195 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీకి (BJP) మరోసటి రోజే ఊహించని షాక్ తగిలింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భోజ్‌పురి సింగర్, నటుడు పవన్ సింగ్ (Pawan Singh) వెనకడుగు వేశారు. తాను పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) అసన్‌సోల్ (Asansol) లోక్‌సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేనని ఎక్స్ వేదికగా తెలిపారు.

Pawan Singh: బీజేపీకి పెద్ద షాక్.. పోటీ చేయలేనంటూ తప్పుకున్న నటుడు.. కారణమిదే!

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) 195 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీకి (BJP) మరోసటి రోజే ఊహించని షాక్ తగిలింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భోజ్‌పురి సింగర్, నటుడు పవన్ సింగ్ (Pawan Singh) వెనకడుగు వేశారు. తాను పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) అసన్‌సోల్ (Asansol) లోక్‌సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేనని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘నాపై నమ్మకం ఉంచి అసన్‌సోల్ అభ్యర్థిగా నా పేరును ప్రకటించినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే.. కొన్ని కారణాల వల్ల నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయలేను’’ అని ఆయన ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.


పవన్ సింగ్ ఇలా ఉన్నపళంగా పోటీ నుంచి తప్పుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆయనకు తొలి జాబితాలో చోటు దక్కిందన్న విషయం తెలియగానే.. బెంగాలీల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పవన్ డిస్కోగ్రఫీలో బెంగాలీ మహిళల్ని కించపరిచే పాటలు ఎన్నో ఉన్నాయని, ఆయన పాటల్లో మహిళల్ని ఎంతో అసభ్యంగా చూపిస్తారని, అలాంటి వ్యక్తికి ఎంపీ సీటు ఎలా ఇస్తారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే.. పవన్‌పై ఉన్న వ్యతిరేకత పార్టీపైనే ప్రభావం చూపించవచ్చని బీజేపీ గ్రహించింది. దీంతో.. అతడ్ని తొలగించడమే శ్రేయస్కరమని భావించి, ఈ సమాచారం అతనికి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు పవన్ సింగ్ ట్వీట్ చేశాడని సమాచారం.

పవన్ ఇలా తప్పుకున్న వెంటనే తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఉపసంహరణ పశ్చిమ బెంగాల్ ప్రజల అద్వితీయమైన స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. పార్టీ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేస్తూ.. అసలు ఆట ప్రారంభం కాకముందే బీజేపీకి దెబ్బ తగిలిందంటూ కౌంటర్ వేశారు. సింగర్, పొలిటీషియన్ బాబుల్ సుప్రియో బదులిస్తూ.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ పవన్‌పై బీజేపీ ఒత్తిడి చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా.. పవన్ సింగ్ స్థానంలో ఎవరిని అసన్‌సోల్ నుంచి రంగంలోకి దింపనున్నారన్నదే ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2024 | 04:26 PM