Share News

Kerala: అలప్పుళ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో 15 మందికి మరణశిక్ష

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:48 PM

కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయిం తీసుకుంది.

Kerala: అలప్పుళ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో 15 మందికి మరణశిక్ష

కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయిం తీసుకుంది. మావెలిక్కర అదనపు కోర్టు న్యాయమూర్తి వీజీ శ్రీదేవి ఈ తీర్పు ఇచ్చారు. క్షమాభిక్ష కోరేందుకు నిందితులు అర్హులు కారని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. తల్లి, భార్య, కూతురి ఎదుటే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేయడం అరుదైన నేరమని, నిందితులకు మరణశిక్ష విధించాలంటూ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన నిందితులు హత్య చేసేందుకు శిక్షణ తీసుకున్నారని అలాంటి వారు బయటకు వస్తే దేశానికే ప్రమాదం అని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.

శిక్ష ఖరారు సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెంగన్నూరు, కాయంకుళం డీఎస్పీల ఆధ్వర్యంలో పహారా కాశారు. అలప్పుళ డీవైఎస్‌పీ ఎన్‌ఆర్‌ జయరాజ్‌ కేసు దర్యాప్తును పూర్తి చేసి చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 156 మంది సాక్షులను విచారించింది. సుమారు వెయ్యి డాక్యుమెంట్లు, దాదాపు వంద ఆధారాలు బయటపడ్డాయి.


గూగుల్ మ్యాప్స్ సహాయంతో తయారు చేసిన వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ, రూట్ మ్యాప్‌లతో సహా అనేక ఆధారాలు కేసు దర్యాప్తునకు కీలకంగా మారాయి. డిసెంబర్ 19, 2021న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రంజిత్ శ్రీనివాసన్ హత్యకు గురయ్యారు. రంజిత్‌ మార్నింగ్‌ రైడ్‌కి వెళ్లేందుకు వెళ్లగా వెల్లకినార్‌లోని తన ఇంట్లోనే హత్య చేయగా.. తల్లి, భార్య, కూతురు ముందే రంజిత్‌ను నిందితులు అతి కిరాతకంగా నరికి చంపారు.

"మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 30 , 2024 | 12:48 PM