Share News

Amit Shah: 'ఇండి' కూటమికే విరాళాలు ఎక్కువ వచ్చాయి.. రాహుల్‌కు అమిత్‍షా కౌంటర్

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:55 PM

ఎలక్టోరల్ బాండ్లను అతిపెద్ద దోపిడీ రాకెట్‌గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. గాంధీకి కూడా రూ.1,600 కోట్లు వచ్చాయనీ, ఆ 'హఫ్తా వసూలీ' ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన వివరించాలని అన్నారు.

Amit Shah: 'ఇండి' కూటమికే విరాళాలు ఎక్కువ వచ్చాయి.. రాహుల్‌కు అమిత్‍షా కౌంటర్

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లను (Electoral bonds) అతిపెద్ద దోపిడీ రాకెట్ (Biggest extortion racket)గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభివర్ణించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తిప్పికొట్టారు. గాంధీకి కూడా రూ.1,600 కోట్లు వచ్చాయనీ, ఆ 'హఫ్తా వసూలీ' (hafta vasooli) ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన వివరించాలని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్‌ అనేవి పారదర్శకమైన విరాళాలనీ, అయితే అది వసూలీగా ఆయన చెబుతున్నారంటే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమిత్‌షా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.


భారతీయ జనతా పార్టీ భారీగా విరాళాలు అందుకున్నట్టు వస్తున్న ఆరోపణలపై అమిత్‌షాను ప్రశ్నించగా, ఇది పూర్తిగా తప్పని ఆయన సమాధానమిచ్చారు. ''మాకు రూ.6,200 కోట్లు వచ్చాయి. రాహుల్ సారథ్యంలోని 'ఇండి అలయెన్స్'కు రూ.6,200 కోట్ల కంటే ఎక్కువే వచ్చాయి. మాకు 303 సీట్లు ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇండి అలయెన్స్‌కు ఎన్ని ఉన్నాయి?'' అని అమిత్‌షా ప్రశ్నించారు.


కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం..

ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంపై అమిత్‌షా మాట్లాడుతూ, అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాము గౌరవిస్తామని, అయితే ఎన్నికల బాండ్లతో రాజకీయాల్లో నల్లధనం దాదాపు కనుమరుగైందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లకు విపక్ష కూటమి వ్యతిరేకిస్తుంది కదా అని అడిగినప్పుడు, రాజకీయాలను శాసించే కట్ మనీ సిస్టమ్‌ను తిరిగి తేవాలని వారనుకుంటున్నారని అమిత్‌షా బదులిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 04:55 PM