Share News

Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే.. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే?

ABN , Publish Date - Jul 12 , 2024 | 08:10 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.

Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే.. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే?

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.

దేశవ్యాప్తంగా హాజరైన ప్రముఖులు వీరే..

1 రామ్ నాథ్ కోవింద్, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి

2 రాజ్‌నాథ్ సింగ్, కేబినెట్ మంత్రి, రక్షణ

3 యోగి ఆదిత్యనాథ్, ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్

4 నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్

5 నారా లోకేష్, ఏపీ మంత్రి

6 పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్

7 మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్


8 ఎంకే స్టాలిన్, ముఖ్యమంత్రి, తమిళనాడు

9 కల్వకుంట్ల తారక రామారావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి, తెలంగాణ ప్రతిపక్ష నేత

10 శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి, మధ్యప్రదేశ్

11 అభిషేక్ మను సింఘ్వి, INC-CWC సభ్యుడు

12 సల్మాన్ ఖుర్షీద్, INC-CWC సభ్యుడు

13 దిగ్విజయ్ సింగ్, INC-CWC సభ్యుడు

14 కపిల్ సిబల్, రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు

15 సచిన్ పైలట్, INC-CWC సభ్యుడు

అంతర్జాతీయ అతిథులు ఎవరంటే..

అనంత్, రాధికల వివాహానికి 50 మందికి పైగా అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ జాబితాలో జాన్ కెర్రీ (అమెరికన్ రాజకీయ నాయకుడు), టోనీ బ్లెయిర్ (UK మాజీ ప్రధాని), బోరిస్ జాన్సన్ (UK మాజీ ప్రధాని), శంతను నారాయణ్ (CEO, అడోబ్), మైఖేల్ గ్రిమ్స్ (మేనేజింగ్ డైరెక్టర్, మోర్గాన్ స్టాన్లీ), జే తదితరులు హాజరయ్యారు.

For Latest News and National News

Updated Date - Jul 12 , 2024 | 08:10 PM