TMC: టీఎంసీకి ఎదురుదెబ్బ.. అసోం పార్టీ అధ్యక్షుడు రాజీనామా
ABN , Publish Date - Sep 01 , 2024 | 05:03 PM
అసోం తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలు టీఎంసీని తమ పార్టీగా అంగీకరించడానికి సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు కీలక వ్యాఖ్యలు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి అసోంలో ఎదురుదెబ్బ తగిలింది. అసోం టీఎంసీ పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా(Ripun Bora) ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. అసోం ప్రజలు టీఎంసీని పశ్చిమ బెంగాల్‌లోని 'ప్రాంతీయ పార్టీ'గా పరిగణిస్తున్నారని, కానీ అసోంలో తమ పార్టీగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదని ఆయన అన్నారు. అంతేకాదు అసోంలో టీఎంసీకి ఆమోదయోగ్యంగా ఉండాలని పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పలు సూచనలు చేశామని గుర్తు చేశారు. అయినప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి రాసిన లేఖలో రిపున్ బోరా స్పష్టం చేశారు.
పట్టించుకోలేదు
TMC జాతీయ స్థాయిలో అస్సామీ నేతను చేర్చుకోవాలని, కోల్‌కతాలోని టోలీగంజ్‌లోని భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా నివాసాన్ని వారసత్వ ప్రదేశంగా ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. కూచ్ బెహార్‌లోని మధుపూర్ సత్రాన్ని సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని కూడా సూచించినట్లు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గత ఏడాదిన్నర కాలంగా అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీలను కలవాలని ప్రయత్నించినా సఫలం కాలేదని రిపున్ బోరా తెలిపారు. రెండేళ్లకు పైగా టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పునరావృత సమస్యలు మా పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు.
అనేక సార్లు సూచనలు
మాజీ రాజ్యసభ సభ్యుడు, అసోంలో టీఎంసీకి ఆమోదయోగ్యంగా ఉండాలని పార్టీ అధిష్టానానికి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అనేక సూచనలు ఇచ్చామన్నారు. కానీ అవి కూడా అమలు కాలేదని చెప్పారు. తాను రెండేళ్లకు పైగా అసోం టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని, ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో విస్తృతంగా సంభాషించానని చెప్పారు. దురదృష్టవశాత్తూ అనేక అంశాల పెండింగ్ నేపథ్యంలో అసోంలోని చాలా మంది ప్రజలు TMCని పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ పార్టీగా చూడడానికి దారితీశాయన్నారు. ఈ క్రమంలో అసోం ప్రజలు వేరే రాష్ట్రానికి చెందిన పార్టీని అంగీకరించడానికి ఇష్టపడటం లేదన్నారు. అనేక సవాళ్లకు తగిన పరిష్కారం లేకపోవడంతో తాను ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్లో మనీ సంపాదించే ఛాన్స్
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Telegram: మరికొన్ని రోజుల్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్?.. కారణాలివేనా..
Read More National News and Latest Telugu News