Share News

Bomb threats: ఇవాళ ఒక్క రోజే 50 విమానాలకు బాంబు బెదిరింపులు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం

ABN , Publish Date - Oct 27 , 2024 | 07:10 PM

భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. అంతకంతకూ ఎక్కువై పోతున్నాయి. ఇవాళ (ఆదివారం) ఒక్క రోజే కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Bomb threats: ఇవాళ ఒక్క రోజే 50 విమానాలకు బాంబు బెదిరింపులు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం

భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. ఇవాళ (ఆదివారం) ఒక్క రోజే కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటితో కలుపుకొని గత 14 రోజుల వ్యవధిలో మొత్తం 350 విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో అత్యధికం సోషల్ మీడియా ద్వారా వచ్చాయని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

తమ సంస్థకు చెందిన 15 విమానాలకు భద్రతా పరమైన అలర్ట్‌లు వచ్చాయని, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత విమానాల కార్యకలాపాలను తిరిగి కొనసాగించామని అకాశ ఎయిర్ ఆదివారం తెలిపింది. ఇండిగోకు చెందిన 18 విమానాలకు, విస్తారాకు చెందిన 17 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


కాగా నకిలీ బాంబు బెదిరింపులతో ఎయిర్‌లైన్స్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తులపై కేంద్రం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆకతాయిలను గుర్తించేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను మరింత అప్రమత్తంగా పరిశీలిస్తోంది. ఐటీ నిబంధనల ప్రకారం నిర్దేశిత తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించాలని లేదా నిలిపివేయాలని ఆయా ప్లాట్‌ఫామ్‌లను కోరినట్టు తెలుస్తోంది.


మరోవైపు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు చేస్తున్న వ్యక్తులను నో ఫ్లయిర్ జాబితాలో చేర్చాలని కేంద్ర యోచిస్తోంది. ఈ దిశగా అడుగులు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శాసనపరమైన చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చేలా మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Oct 27 , 2024 | 08:22 PM