Share News

Uttarakhand: బద్రీనాథ్ హైవే మూసివేత..

ABN , Publish Date - Jul 12 , 2024 | 11:27 AM

న్యూఢిల్లీ: బద్రీనాథ్ హైవేను అధికారులు మూసివేశారు. దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Uttarakhand: బద్రీనాథ్ హైవే మూసివేత..

న్యూఢిల్లీ: బద్రీనాథ్ హైవే (Badrinath highway)ను అధికారులు మూసివేశారు (Close). దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు (Pilgrims) చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జోషి మఠ్ (Joshi Math) వద్ద కొండచరియలు (Landslides) విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. దీంతో అక్కడ దాదాపు 2వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. మరో 24 గంటల పాటు రోడ్డును బ్లాక్ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణీకులను ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాల సహాయంతో సురక్షితంగా తరలిస్తున్నామని, ఆహారం, నీరు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.


ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా.. ఛమోలీ జిల్లాలోని బహనీర్పానీ, జోషీమఠ్ రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సదరు జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే.. బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై పాతాళ గంగా లంగసీ టనల్ వద్ద భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు. దీంతో రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.


బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైవే మూసివేతతో బద్రీనాథ్, జోషిమఠ్‌, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్‌లతో కనెక్టివిటీ తెగిపోయింది. సుమారు 2వేల మంది యాత్రికులు హైవేపై చిక్కుకుపోయారు. మరోవైపు.. 3 వేల మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్‌ చేసేందుకు బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్‌ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు పచ్చజెండా

4.0 పాలనలో దూసుకుపోతున్న ఏపీ

ఆ జిల్లాలో పట్టు కోల్పోతున్న వైసీపీ..!

తెలంగాణలో డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 12 , 2024 | 11:29 AM