Share News

West Bengal: బీజేపీ అగ్రనేతల బృందంపై సొంత పార్టీ కేడర్ గరం గరం

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:40 PM

సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కేడర్‌పై అధికార టీఎంసీ శ్రేణులు వరుసగా దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులపై బీజేపీ అగ్రనాయకత్వం నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిటి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది. ఆ క్రమంలో విచారణ బృందం ఎదుట బీజేపీ కేడర్ మంగళవారం ఆందోళనకు దిగింది.

West Bengal: బీజేపీ అగ్రనేతల బృందంపై సొంత పార్టీ కేడర్ గరం గరం

కోల్‌కతా, జూన్ 18: సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కేడర్‌పై అధికార టీఎంసీ శ్రేణులు వరుసగా దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులపై బీజేపీ అగ్రనాయకత్వం నలుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిటి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది. ఆ క్రమంలో విచారణ బృందం ఎదుట బీజేపీ కేడర్ మంగళవారం ఆందోళనకు దిగింది. హింస జరుగుతున్న సమయంలో తమను రక్షించేందుకు సొంత పార్టీ నేతలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ప్రత్యర్థులు తమను నివాసాల్లో నుంచి బలవంతంగా బయటకు తీసుకు వెళ్లినా.. పార్టీ నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడింది. సొంత పార్టీ నేతల వల్లే తాము ఇన్నీ ఇబ్బందులు పడ్డామని విచారణ కమిటీ ముందు కేడర్ ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా


ఎన్నికల అనంతరం చెలరేగిన హింస..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వివిధ దశల్లో జరిగాయి. ఈ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ప్రత్యర్థి పార్టీ బీజేపీ కేడర్ లక్ష్యంగా దాడులకు తెగబడింది.

స్పందించిన నడ్డా..

ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. విప్లవ్ దేవ్ కన్వీనర్‌గా ముగ్గురు సభ్యులు రవి శంకర్ ప్రసాద్, రాజ్యసభ సభ్యులు బ్రిజ్ లాల్, కవిత పాటిదార్‌లతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సదరు కమిటీ పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటిస్తుంది.

ఓ వైపు టీఎంసీకి హితవు.. మరోవైపు శంతాన్ సేన్ స్పందన..

అందులోభాగంగా ఆ కమిటీ మంగళవారం దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని అమటాలాలో పర్యటించింది. ఆ క్రమంలో ఆ బృందం ఎదుట బీజేపీ కేడర్ తమ నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ బృందం కన్వీనర్ విప్లవ్ దేవ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలపై దాడి చేసే ఇటువంటి వైఖరిని అధికార టీఎంసీ ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిదంటూ ఆ పార్టీకి హితవు పలికారు. ఇక ఈ ఘటనపై అధికార టీఎంసీ నేత శంతాన్ సేన్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ కేడర్.. నిరసనకు దిగిందంటే ఆ పార్టీ నేతలతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లేనని స్పష్టం చేశారు.

Also Read: Delhi: ఢిల్లీలో రెడ్ అలర్ట్..


సువేందో అధికారిని వెనక్కి పంపిన పోలీసులు..

ఇంకోవైపు ఈ హింస నేపథ్యంలో బాధితులను తీసుకుని గవర్నర్‌ను కలిసేందుకు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందో అధికారి ఇటీవల రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే ఆయన్ని రాజ్‌భవన్‌లోకి పోలీసులు అనుమతించ లేదు.

బెంగాల్ గవర్నర్ సైతం కీలక ఆదేశాలు..

తాజాగా రాజ్‌భవన్ నుంచి పోలీసులు వెళ్లి పోవాలంటూ.. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందో అధికారిని రాజ్‌భవన్ బయటే నిలిపి వేయడంతోనే గవర్నర్ ఈ విధంగా ఆదేశించారనే ఓ చర్చ సైతం నడుస్తుంది.

పోలీసులు క్లారిటీ..

అయితే రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని అందుకే.. సువేందో అధికారిని గవర్నర్‌తో భేటీకి అనుమతించ లేదని పోలీస్ శాఖ స్పష్టం చేస్తుంది.

Also Read: బాలాసోర్‌లో ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు


Read Latest
Telangana News and National News

Updated Date - Jun 18 , 2024 | 08:03 PM