Share News

Bharat Ratna: అద్వానీకి నేడు భారతరత్న అవార్డు ప్రదానం

ABN , Publish Date - Mar 31 , 2024 | 10:01 AM

న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్‌కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించారు.

Bharat Ratna: అద్వానీకి నేడు భారతరత్న అవార్డు ప్రదానం

న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్‌కే అద్వానీ (LK Advani)కి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) భారత రత్న (Bharat Ratna) అవార్డు (Award) ప్రదానం చేయనున్నారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రధానం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆదివారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ (PM Modi) సహా ఇతర ప్రముఖులు అద్వానీ నివాసానికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు.

రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీకి గత ఫిబ్రవరిలో కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌, మాజీ ప్రధానమంత్రులు పీవీ నర్సింహారావు, చౌదరీ చరణ్‌ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. పీవీ తరపున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు భారతరత్నను స్వీకరించారు. చరణ్‌ సింగ్‌ తరపున ఆయన మనుమడు జయంత్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరీ ఠాకూర్‌ తరపున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌ పురస్కారాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ , కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఎల్‌కే అద్వానీకి ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ముర్ము భారతరత్నను ప్రధానం చేయునున్నారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పీవీ తరపున పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రభాకార్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కొడుకు ప్రభాకర్‌రావు, కూతురు శారదా దేవి తెలిపారు. దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం అవార్డును ప్రకటించిందని అన్నారు. పీవీ చేపట్టిన సంస్కరణలను ఇప్పటికీ కేంద్రప్రభుత్వం అమలు చేస్తోందని వారు పేర్కొన్నారు. దేశ అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించిన మహనీయులను భారతరత్నతో సత్కరించుకోవడం గర్వంగా ఉందని తెలంగాణ హైకోర్టు జడ్జి ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌ అన్నారు.

Updated Date - Mar 31 , 2024 | 10:03 AM