Share News

National Politics: నోటీసు చూసి షాకయ్యా.. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా..

ABN , Publish Date - May 23 , 2024 | 03:15 PM

ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదంటూ పార్టీ ఇచ్చిన షోక్ నోటీసుపై బీజేపీ సీనియర్ నేత, హజారీబాగ్ ఎంపీ జయంత్ సిన్హా స్పందించారు. షోకాజ్ నోటీసు చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదని, ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదో వివరణ అడుగుతూ బీజేపీ జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు షోకాజ్ నోటీసు జారీ చేశారన్నారు.

National Politics: నోటీసు చూసి షాకయ్యా.. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా..
Jayant Sinha

ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదంటూ పార్టీ ఇచ్చిన షోక్ నోటీసుపై బీజేపీ సీనియర్ నేత, హజారీబాగ్ ఎంపీ జయంత్ సిన్హా స్పందించారు. షోకాజ్ నోటీసు చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదని, ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదో వివరణ అడుగుతూ బీజేపీ జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు షోకాజ్ నోటీసు జారీ చేశారన్నారు. వ్యక్తిగత కారణాత రీత్యా తాను విదేశాల్లో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకున్నట్లు ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు. షోకాజ్ నోటీసుపై రెండు పేజీల వివరణతో కూడిన లేఖను జయంత్ సిన్హా అందజేశారు. షోకాజ్ నోటీసు చూడగానే తాను షాకయ్యానని.. ఆ లేఖ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యానని సిన్హా తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయబోనని తాను ఈ ఏడాది మార్చి2న ప్రకటించిన విషయాన్ని లేఖలో పొందుపర్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో మాట్లాడిన తర్వాత ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Mallikarjuna Kharge : అయోధ్యపై బుల్డోజర్‌ అబద్ధం


పిలవకుండా ఎలా వస్తా..

హజారీబాగ్ అభ్యర్థిగా పార్టీ మనీష్ జైస్వాల్‌ను ప్రకటించిందని, మార్చి8న ఆయనకు తాను అభినందనలు తెలిపడం ద్వారా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపానన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే తనను సంప్రదించి ఉండేవారని.. జార్ఖండ్‌కు చెందిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే లేదా పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ తనను సంప్రదించలేదని సిన్హా లఏఖలో తెలిపారు. పార్టీ బహిరంగ సభలు లేదా సంస్థాగత సమావేశాలకు తనను పిలవలేదన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చిన తర్వాత వ్యక్తిగత పనుల కారణంగా మే10వ తేదీన విదేశాలకు వెళ్లానని జయంత్ సిన్హా స్పష్టం చేశారు. పార్టీ తనను ఎలాంటి కార్యక్రమాలకు పిలవకపోవడంతో తన అవసరం లేదనిపించిందన్నారు. విదేశాలకు వెళ్లే ముందు తాను పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. తాను ఓటు వేయలేదని ఆరోపించడం సరికాదన్నారు. పార్టీలో తన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో నిర్వర్తించానని.. అలాగే తన పనితీరుకు ఎన్నోసార్లు ప్రశంసలు లభించిన విషయాన్ని లేఖలో సిన్హా గుర్తుచేశారు.


నిరాశ చెందా..

తనకు పార్టీ అందించిన షోకాజ్ నోటీసుపై మీడియాలో ప్రచారం కావడం నిరాశపర్చిందన్నారు. ఈ లేఖను బహిరంగ పర్చడం తన దృష్టిలో సరికాదన్నారు. ఇటువంటి వైఖరి అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్తలను నిరాశపరచడమే అవుతుందన్నారు. పార్టీ కోసం విధేయతతో పనిచేసే తనను కావాలని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని సిన్హా తన వివరణలో పేర్కొన్నారు.


పాక్‌కు.. రాహుల్‌, అఖిలేశ్‌ జై

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 23 , 2024 | 03:15 PM