Shah Rukh Khan: కాంగ్రెస్ ప్రచారంలో 'షారూక్'.. అసలు సంగతేమిటంటే?
ABN , Publish Date - Apr 19 , 2024 | 06:40 PM
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల రెండో విడత ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో భాగంగా షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతి షిండే తరఫున బాలీవుడ్ బాద్షా 'షారూక్ ఖాన్' వచ్చారంటూ జనం శుక్రవారంనాడు ఎగబడ్డారు. ఆ తర్వాత వచ్చిందెవరో తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
మంబై: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో భాగంగా షోలాపూర్ (Sholapur) కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతి షిండే తరఫున బాలీవుడ్ బాద్షా 'షారూక్ ఖాన్' (Shah Rukh Khan) వచ్చారంటూ జనం శుక్రవారంనాడు ఎగబడ్డారు. తనదైన శైలిలో ఆయన చేతులు ఊపుతూ, ట్రెడిషనల్ పోనీ టైల్తో, జట్టు వెనక్కి తీసుకుంటూ ముందుకు దూసుకు వెళ్లారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ప్రచారంలో జనాలను ఉర్రూతలూగించిన ఆ వ్యక్తి షారూక్ ఖాన్ కాదు, సరిగ్గా షారూక్‌నే పోలిన వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో బీజేపీ మండిపడింది. ఇది కాంగ్రెస్ మరో 'స్కామ్' అంటూ విమర్శలు గుప్పించింది.
Mamata Banerjee: ఓటు వేయకుండా తిరిగి వెళ్లకండి.. దీదీ 'సిటిజన్‌షిప్' వార్నింగ్
ప్రజలను ఫూల్స్ చేస్తారా?
షారూక్ ఖాన్ డూప్‌తో కాంగ్రెస్ ప్రచారం సాగిస్తున్న ఫోటోలను బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఎన్నికల కమిషన్‌కు, షారూక్ ఖాన్‌కు కూడా వీటిని షేర్ చేశారు. కాంగ్రెస్ ప్రజలను ఏ విధంగా ఫూల్స్ చేస్తోందో చూడండని ఆయన తన ట్వీట్లో తప్పుపట్టారు. నకిలీ సర్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సెలబ్రెటీలను చూపించడం, ఇప్పుడు డూప్లతో ప్రజలను తప్పుదారి పట్టించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఈవీఎంలను సైతం కాంగ్రెస్ తప్పుపడుతుండటం అందరికే తెలిసిందేనన్నారు. షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండే పోటీ చేస్తుండగా, మూడో ఫేజ్‌లో భాగంగా మే 7న ఇక్కడ పోలింగ్ జరుగనుంది.
జాతీయ వార్తలు కోసం...