BJP vs TMC: 9నిమిషాల ప్రసంగంలో 76 సార్లు ఒకటే పదం.. సీఎం మమతపై సువేందు సెటైర్లు..
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:54 AM
జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న స్వాస్థ భవన్‌కు వెళ్లిన మమతా బెనర్జీ తన ప్రసంగంలో ఎక్కువ సేపు తన గురించే ప్రస్తావించుకున్నారని, ఆమె గురించి కొంచెం ఎక్కువుగా చెప్పుకున్నారంటూ ఎద్దెవా చేశారు. మమతా బెనర్జీ వ్యక్తిత్వానికి..
పశ్చిమబెంగాల్‌లో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనపై వైద్యుల ఆందోళన కొనసాగుతుండగా.. బీజేపీ, తృణమూల్ మధ్యన మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్దిరోజులుగా పశ్చిమ బెంగాల్‌లో అభయ హత్యాచారం ఘటన కేంద్రంగానే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం మమతా బెనర్జీని తాజాగా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీ వీడియోను విడుదల చేశారు. వైద్యల నిరసన స్థలం వద్దకు వెళ్లిన మమతా బెనర్జీ మాట్లాడిన 9 నిమిషల వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైద్యలు ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిరసన శిబిరం వద్దకు వెళ్లిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడారు.
వీడియోలో ఏముంది..
ఎక్స్‌లో బీజేపీ నేత సువేందు అధికారి పోస్టు చేసిన వీడియోలో 9 నిమిషాల మమతా బెనర్జీ ప్రసంగం ఉంది. ఈ ప్రసంగంలో నేను, నాది, నేనే అనే పదాన్ని మమతా బెనర్జీ 76 సార్లు ఉపయోగించారని సువేందు అధికారి పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న స్వాస్థ భవన్‌కు వెళ్లిన మమతా బెనర్జీ తన ప్రసంగంలో ఎక్కువ సేపు తన గురించే ప్రస్తావించుకున్నారని, ఆమె గురించి కొంచెం ఎక్కువుగా చెప్పుకున్నారంటూ ఎద్దెవా చేశారు. మమతా బెనర్జీ వ్యక్తిత్వానికి ఈ వీడియో నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరు చెప్పినా ఆమె వినరన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం చాలా కష్టమని సువేందు అధికారి పేర్కొన్నారు.
మమత ఏమన్నారు..
ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్ అభయపై ఆగష్టు9న కోల్‌కతాలో హత్యాచారం జరిగింది. ఈ ఘటన తర్వాత జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. కోల్‌కతాలోని స్వాస్థ భవన్‌లో జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. భారీ వర్షంలోనూ జూనియర్ డాక్టర్లు నిరసన స్థలంలోనే ఉన్నారు. దీంతో శనివారం జూనియర్ వైద్యుల నిరసన శిబిరం వద్దకు వెళ్లి వెంటనే విధుల్లో చేరాలని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాను విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చానని మమతా బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. నేను నా జీవితంలో చాలా కష్టపడ్డానని, మీ కష్టాన్ని తాను అర్థం చేసుకున్నానని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here