Maharashtra: 'మహా' బంద్‌కు అడ్డుకట్ట వేసిన హైకోర్టు
ABN , Publish Date - Aug 23 , 2024 | 05:33 PM
థానే జిల్లా బద్లాపూర్ లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడుల ఆరోపణలపై ఈనెల 24న 'మహారాష్ట్ర బంద్'కు విపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు ముంబై హైకోర్టు అడ్డుకట్టు వేసింది. బంద్ పిలుపునకు రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ దూరంగా ఉండాలని శుక్రవారంనాడు ఆదేశాలు ఇచ్చింది.
ముంబై: థానే జిల్లా బద్లాపూర్ (Badlapur)లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడుల ఆరోపణలపై ఈనెల 24న 'మహారాష్ట్ర బంద్'కు విపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు ముంబై హైకోర్టు (Bombay High Court) అడ్డుకట్టు వేసింది. బంద్ పిలుపునకు రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ దూరంగా ఉండాలని శుక్రవారంనాడు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఏ రాజకీయ పార్టీలు బంద్ పిలుపునివ్వడం కానీ, పాల్గొనడం కానీ చేయరాదు.
మహారాష్ట్ర బంద్‌పై దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. బంద్‌కు దూరంగా ఉండాలని రాజకీయ పార్టీలకు బెంచ్ ఆదేశాలిచ్చింది. బాలికలపై లైంగిక దాడులకు నిరసనగా ఆగస్టు 24న రాష్ట్ర బంద్ నిర్వహించాలని విపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఎం) బుధవారంనాడు పిలుపునిచ్చిన నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలిచ్చింది.
Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు నమోదు చేసుకోవాలంటూ బద్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద 11 గంటలు నిరీక్షించారని ఎంవీఏ ఇంతకుముందు ఆరోపించింది. ఆందోళనకు దిగిన వ్యక్తులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతామని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే శుక్రవారంనాడు హెచ్చరించారు. విపక్ష కూటమి ఇచ్చిన బంద్ పిలుపులో ఎలాంటి రాజకీయాలు లేవని, కుల, మతాలకు అతీతంగా అందరూ బంద్‌లో పాల్గొనాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..