BSP : మేనల్లుడే వారసుడు: మాయావతి
ABN , Publish Date - Jun 24 , 2024 | 04:00 AM
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను మరోసారి తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు.
లఖ్‌నవూ, జూన్ 23: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను మరోసారి తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఆయనకు పార్టీ జాతీయ సమన్వయకర్తగా తిరిగి బాధ్యతలు అప్పగిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. గతనెలలో ఎన్నికల సమయంలో ఆకాశ్‌కు పరిపక్వత లేదని పేర్కొంటూ ఆయనను వారసుడిగా తొలగించడంతో పాటు పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ‘‘ఆకాశ్ పూర్తి పరిణతి కలిగిన నేత ఎదుగుతారని ఆశిస్తున్నా. భవిష్యత్తులో అతను నా అంచనాలను అందుకోగలరు’’ అని తాజాగా మాయావతి పేర్కొన్నారు.