Share News

Budget 2024: నిర్మలమ్మ పద్దుపై యోగి ప్రశంసలు

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:18 PM

2024-2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సభకు ప్రకటించారు. నిర్మల పద్దుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి లక్ష్యంగా పద్దు రూపొందించారని వివరించారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.

Budget 2024: నిర్మలమ్మ పద్దుపై యోగి ప్రశంసలు
UP CM Yogi Adityanath

ఢిల్లీ: 2024-2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సభకు ప్రకటించారు. నిర్మల పద్దుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి లక్ష్యంగా పద్దు రూపొందించారని వివరించారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.


మహిళలకు ప్రాధాన్యం..

‘రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశ పెట్టారు, 3 లక్షల కోట్ల మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చారు. కొత్త పన్ను విధానాన్ని అభినందనీయం. దీంతో మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుంది. యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాల కల్పిస్తామని ప్రకటించారు. నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలతో భారతదేశం 5 ట్రిలియన్ అమెరికా డాలర్ల మారేందుకు దోహద పడుతుంది. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని’ యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.


Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..


కీలక అంశాలివే..?

అంతకుముందు సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదించారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ప్రకటించారు. 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. భవిష్యత్ రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నాయని వివరించారు. విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ.. ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీలను బడ్జెట్‌లో ప్రకటించారు. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, ఉపాధి, నైపుణ్యం, తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 23 , 2024 | 04:18 PM