Share News

Delhi : ‘రైల్వే’ కుంభోణంలో లాలుపై సీబీఐ తుది ఛార్జిషీటు

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:10 AM

యజమానుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌పై సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసింది.

Delhi : ‘రైల్వే’ కుంభోణంలో లాలుపై సీబీఐ తుది ఛార్జిషీటు

న్యూఢిల్లీ, జూన్‌ 7: యజమానుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌పై సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసింది. లాలు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అన్ని జోన్లలో జరిగిన ఉద్యోగాల భర్తీపై దర్యాప్తు చేసిన అనంతరం నివేదిక రూపొందించింది. దీన్ని శుక్రవారం ప్రత్యేక కోర్టులో సమర్పించింది. లాలుతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, కుమార్తె హేమా యాదవ్‌, వారి మాజీ సహాయకుడు భోలా యాదవ్‌లపై అభియోగాలు మోపింది. దీనిని జులై 6న ప్రత్యేక కోర్టు పరిశీలించనుంది.

Updated Date - Jun 08 , 2024 | 06:56 AM