Share News

Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

ABN , Publish Date - Sep 01 , 2024 | 08:59 AM

ఉద్యోగ పరిధిని అతిక్రమించి.. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహనగరంలోని కర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..

ఉద్యోగ పరిధిని అతిక్రమించి.. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహనగరంలోని కర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి రాజ్ తిలక్ రోషన్ వెల్లడించారు.

ముంబయిలో కాలినా ప్రాంతంలో వివాదాస్పద స్థలంపై బిల్డర్ కన్ను పడింది. అందులోభాగంగా స్థలంలో నివసిస్తున్న డానియల్‌పై అక్రమంగా బలమైన కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులను బిల్డర్ రంగంలోకి దింపారు. ఆ క్రమంలో ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు.. ఆ స్థలంలో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు.

Also Read: Haryana Assembly Elections: బీజేపీపై గెలుపునకు కాంగ్రెస్ వినూత్న ప్రచారం


డానియల్‌ను తనిఖీలు చేస్తూ.. తమ వద్ద ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను అతడి ప్యాంట్ జేబులో ఈ పోలీసులు పెట్టారు. అందుకు సంబంధించిన వ్యవహారమంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ విషయాన్ని సదరు పోలీసులు గమనించలేదు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డానియల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు సైతం నమోదు చేశారు. డేనియల్ విచారణలో భాగంగా ఈ వ్యవహారం సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు పోలీస్ ఉన్నతాధికారులకు వెల్లడించారు. దీంతో కంగుతిన్న పోలీసులు అతడిని వెంటనే విడుదల చేశారు.


మరోవైపు పోలీసుల వ్యవహారం బయటకు పొక్కడంతో.. ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డానియల్ ప్లాట్ వద్ద తనిఖీలు నిర్వహించిన నలుగురి పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి రాజ్ తిలక్ రోషన్ తెలిపారు. బిల్డర్ అభ్యర్థ మేరకు డానియేల్ లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని అతడి సహాచరుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


ఇటీవల పలువురు పోలీసులు చట్ట వ్యతిరేక వ్యవహారాల్లో తలదూర్చుతున్న సంఘటనలు కోకొల్లలుగా బహిర్గతమవుతున్నాయి. అందుకు దేశంలోని ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం అనేది మినహాయింపు లేకేండా పోయిందనే ఓ చర్చ సైతం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. పోలీసులు తమ విధులను వదిలి.. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు సైతం వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ముంబయికి చెందిన ఓ సినీ నటిని ఇబ్బందులకు గురి చేసిన ఘటనలో సాక్షాత్తూ పోలీస్ ఉన్నతాధికారులు క్రియాశీలకంగా వ్యవహరించారనే వాదనలు సైతం ఉన్నాయి. ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలను అనుగుణంగా వ్యవహరించి.. వారి ఈ విధంగా చిక్కులను కొని తెచ్చుకుంటున్నారనే ప్రచారం సైతం ప్రజల్లో కొనసాగుతుంది.

Updated Date - Sep 01 , 2024 | 08:59 AM