త్వరలో ‘రైల్వే సూపర్ యాప్’ ఆవిష్కరణ
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:45 AM
రైల్వే సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యే ‘సూపర్ యాప్’ త్వరలో అందుబాటులోకి రానుంది. టిక్కెట్ల బుకింగ్, రిజర్వేషన్లు, ప్లాట్‌ఫారం టిక్కెట్లు, కేటరింగ్...
ఇక సేవలన్నీ ఒకే చోట అందుబాటులో...
న్యూఢిల్లీ. నవంబరు 4: రైల్వే సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యే ‘సూపర్ యాప్’ త్వరలో అందుబాటులోకి రానుంది. టిక్కెట్ల బుకింగ్, రిజర్వేషన్లు, ప్లాట్‌ఫారం టిక్కెట్లు, కేటరింగ్... తదితర సేవలన్నింటినీ సమన్వయపరిచి ఒకే యాప్ రూపంలో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ‘క్రిస్’ సంస్థ ఈ నూతన యాప్ రూపకల్పనలో నిమగ్నమయింది. ఈ సమగ్ర మొబైల్ అప్లికేషన్ వచ్చే నెలలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందుతున్నాయి. ఒక్కో సేవకు ఒక్కో అప్లికేషన్ ఉండడంతో వాటన్నింటినీ సమన్వయపరిచి సమగ్రమైన యూప్‌ను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌తో 2023-24లో ఐఆర్‌సీటీసీ రూ.4,270.18 కోట్ల రెవెన్యూను ఆర్జించగా అందులో రూ.1,111.26 కోట్లు లాభంగా మిగిలింది. 45.30 కోట్ల టికెట్ బుకింగ్‌లు జరిగాయి.