Share News

Puja Khedkar: పూజా కేడ్కర్‌పై డీఓపీటీకి నివేదిక సమర్పించిన ఏకసభ్య కమిటీ

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:17 PM

వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజ కేడ్కర్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేంద్రం నియమించిన ఏక సభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన నివేదకను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కి సమర్పించింది.

Puja Khedkar: పూజా కేడ్కర్‌పై డీఓపీటీకి నివేదిక సమర్పించిన ఏకసభ్య కమిటీ

న్యూఢిల్లీ: వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజ కేడ్కర్ (Puja Khedkar)పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేంద్రం నియమించిన ఏక సభ్య కమిటీ (single member panel) దర్యాప్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన నివేదకను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT)కి సమర్పించింది. డీఓపీటీలోని అడిషనల్ సెక్రటరీ మనోజ్ ద్వివేది ఈ ఇన్వెస్టిగేషన్ నిర్వహించారు.


2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిగా పుణె కలెక్టర్ కార్యాలయంలో పూజా కేడ్కర్ శిక్షణ పొందుతూ వివాదంలో చిక్కుకున్నారు. శిక్షణా కాలంలో పలు డిమాండ్లు చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఆమెను చిక్కుల్లో పెట్టింది. ఈ క్రమంలోనే యూపీఎస్‌సీలో తప్పుడు పత్రాలు సమర్పించారనే ఆరోపణలు రావడంతో ఆమెపై యూపీఎస్‌సీ విచారణ జరిపి ఒక నిర్ధారణకు రావడంతో క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఖేడ్కర్‌ ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ, భవిష్యత్ పరీక్షల నుంచి డిబార్ చేస్తూ ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది.

UPSC aspirants death: విపత్తు కాదు, హత్యే.. పార్లమెంటులో ప్రస్తావిస్తానన్న స్వాతి మలివాల్


మహారాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ మాజీ అధికారి అయిన ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ సైతం ప్రస్తుతం అవినీతి కేసును ఎదుర్కొంటున్నారు. గతంలో ముడుపుల వ్యవహారంతో పాటు అవినీతి ఆరోపణలపై ఆయన రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. కాగా, సర్పంచ్ అయిన ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడర్క్ కూడా ఇటీవల చిక్కుల్లో పడ్డారు. కొందరు వ్యక్తులను తుపాకితో ఆమె బెదిరిస్తున్న వీడియో వెలుగుచూడటంతో ఆయుధాల చట్టం కింద ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 06:17 PM