Share News

Priyanka Gandhi: నిద్ర నుంచి మేల్కోవాలంటూ మోదీకి చురకలు

ABN , Publish Date - Jul 15 , 2024 | 07:30 PM

మణిపూర్‌లోని జిరిబమ్‌లో భద్రత దళాల కాన్వాయిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. మణిపూర్‌లో జాతుల మధ్య సంఘర్ణణకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్జప్తి చేశారు.

Priyanka Gandhi: నిద్ర నుంచి మేల్కోవాలంటూ మోదీకి చురకలు

న్యూఢిల్లీ, జులై 15: మణిపూర్‌లోని జిరిబమ్‌లో భద్రత దళాల కాన్వాయిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. మణిపూర్‌లో జాతుల మధ్య సంఘర్ణణకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్జప్తి చేశారు. గతేడాది మే 3వ తేదీన ఆ రాష్ట్రంలో హింస మొదలైందన్నారు. అది నేటికి కొనసాగుతుందని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ రాష్ట్రం పూర్తిగా విచ్చిన్నమై పోయిందని ఈ సందర్భంగా ప్రియాంక ఆందోళన చెందారు.

Also Read: Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్

Also Read: Iskcon: డోనాల్డ్ ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు

Also Read: Arvind Kejriwal: ఆరోగ్యంపై స్పందించిన తీహాడ్.. తొసిపుచ్చిన ఆప్


ఇకనైనా నిద్ర నుంచి మేల్కోవాలంటూ.. ప్రధాని మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి ఆమె చురకలంటించారు. ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరమన్నారు. సీఆర్పీఎఫ్ జవాను మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ప్రియాంక గాంధీ స్పందించారు. ఆదివారం కాన్వాయిపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మణిపూర్ సీఎం బైరన్ సింగ్ ఖండిచారు. ఇది కూకీ తీవ్రవాదుల పనే అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ స్పందించారు. ఈ ఘటనలో జవాన్ మృతి చెందడం పట్ల ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read:Donald Trump: ఆఫీసర్.. ఆఫీసర్ అన్నా పట్టించుకోలేదా?

Also Read: Pune Police: పరారీలో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు


మణిపూర్‌లో జిరిబమ్ జిల్లాలోని మాంగ్‌బంగ్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలతో వెళ్తున్న కాన్వాయ్‌పై దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన జవాన్ బిహార్‌కు చెందిన అజయ్‌ కుమార్‌ ఝాగా అధికారులు గుర్తించారు. తలలో బుల్లెట్‌ దిగడంతోనే ఆయన మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 07:31 PM