Share News

Speaker Election: రాహుల్ చెబుతున్న ‘సంప్రదాయం’.. ‘ఇండియా’లో కనరావడం లేదు

ABN , Publish Date - Jun 25 , 2024 | 05:38 PM

లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా భావించారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ స్పీకర్ అభ్యర్థిగా కె.సురేశ్‌ను బరిలో దింపింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.

Speaker Election: రాహుల్ చెబుతున్న ‘సంప్రదాయం’.. ‘ఇండియా’లో కనరావడం లేదు
Congress MP Rahul Gandhi

న్యూఢిల్లీ, జూన్ 25: లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా భావించారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ స్పీకర్ అభ్యర్థిగా కె.సురేశ్‌ను బరిలో దింపింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి రేపు ఎన్నిక జరగనుంది. అయితే లోక్‌సభ స్పీకర్ పదవి మీరు తీసుకోండి.. డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం ప్రతిపక్షానికి కేటాయించి పాత సంప్రదాయాన్ని కొనసాగించడంటూ బీజేపీ పెద్దల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదన చేశారు. రాహుల్ చెబుతున్న ఈ పాత సంప్రదాయంపై రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ అయితే వాడి వేడిగా నడుస్తుంది.

Also Read: Telangana: లోక్‌సభలో ప్రమాణం చేసిన తెలంగాణ ఎంపీలు


Also Read: అమరణ నిరాహార దీక్ష విరమించిన మంత్రి అతిషి

ఎందుకంటే బీజేపీ పెద్దల ముందు రాహుల్ గాంధీ పెట్టిన ఈ ‘సంప్రదాయం’ అనవాళ్లు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రంలో కానరావడం లేదనే ఓ చర్చ అయితే వైరలవుతుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, కేరళ అసెంబ్లీలలో అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలే స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లుగా కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు తెలంగాణ, ఝార్ఖండ్‌లలో స్పీకర్‌గా ఆ పార్టీ వారే ఎన్నికయ్యారు. మరోవైపు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్లు లేక పోవడం గమనార్హం. అలాగే పంజాబ్‌, ఢిల్లీలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ యా రాష్ట్రాల అసెంబ్లీలలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరు అధికార పార్టీకి చెందిన వారేనన్న విషయం అందరికీ తెలిసిందే.

Also Read: కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం


Also Read: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో సైతం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరు హస్తం పార్టీకి చెందిన వారే కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న పాత సంప్రదాయం ‘ఇండియా కూటమి’ ఎలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా లేదనే ఓ చర్చ సైతం హట్ హట్‌గా కొనసాగుతుంది.

Also Read: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 05:40 PM