Share News

కందిలో గంజాయి సాగు.. 2కోట్ల సరుకు సీజ్‌

ABN , Publish Date - Oct 09 , 2024 | 05:21 AM

బీదర్‌ జిల్లా బసవకల్యాణ తాలూకాలో రూ.2 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కందిలో గంజాయి సాగు.. 2కోట్ల సరుకు సీజ్‌

బెంగళూరు/గువాహటి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): బీదర్‌ జిల్లా బసవకల్యాణ తాలూకాలో రూ.2 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహారాష్ట్రలోని ఉస్నాబాద్‌ జిల్లా ఉమర్గా తాలూకా హిప్పరగారావ్‌వాడి గ్రామస్థుడిని అరెస్టు చేశారు. నిందితుడు బసవకల్యాణ తాలూకా ఉజళంబ గ్రామంలో కందిపంట మధ్యలో గంజాయి సాగు చేశాడు. స్థానిక రైతుల నుంచి భూమిని కౌలుకు తీసుకుని, గంజాయి సాగు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి 40 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరాఠా పోలీసులిచ్చిన సమాచారంతో గంజాయి పంటను గుర్తించామని అధికారులు తెలిపారు. కాగా, అస్సాం రాష్ట్రంలోని బిస్వనాథ్‌, కాచర్‌ జిల్లాలలో వివిధ చోట్ల జరిపిన దాడుల్లో సుమారు రూ 11 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం ఎక్స్‌లో ప్రకటించారు. ఒక్క కామరూప్‌ జిల్లాలోని బోకో వద్ద జరిపిన సోదాల్లోనే 301 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

Updated Date - Oct 09 , 2024 | 05:21 AM