Share News

Delhi : ‘లఖింపూర్‌ హింస’ కేసులో ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:21 AM

లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఆయన ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ ఆదేశించింది.

Delhi : ‘లఖింపూర్‌ హింస’ కేసులో ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌

న్యూఢిల్లీ, జూలై 22: లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఆయన ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ ఆదేశించింది. 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆందోళన చేస్తున్న రైతుల మీదకు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ కేసులో గతేడాది జనవరి 25న ఆశిష్‌ మిశ్రాకు మధ్యంతర బెయిల్‌ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. తాజా విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ ‘114 మంది సాక్షుల్లో ఇప్పటివరకు ఏడుగురినే విచారించారు. విచారణను వేగవంతం చేయాలని ట్రయల్‌ కోర్టును ఆదేశిస్తున్నాం’ అని పేర్కొంది. కేసులోని మరో నలుగురు రైతులకు కూడా బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - Jul 23 , 2024 | 05:21 AM