Share News

Delhi : అసోంలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:15 AM

అసోంలోని నగాన్‌ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా ఆందోళనలకు దారితీసింది.

Delhi : అసోంలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 23: అసోంలోని నగాన్‌ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా ఆందోళనలకు దారితీసింది. ఆ బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్‌ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. దీంతో రోడ్డు పక్కన అచేతనంగా పడివున్న బాలికను రక్షించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో తఫజుల్‌ ఇస్లాం అనే నిందితుడిని అరెస్టు చేశారు. స్థానిక విద్యార్థి సంఘాలు దీనిపై భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించి బంద్‌కు పిలుపునిచ్చాయి.

Updated Date - Aug 24 , 2024 | 03:15 AM