Delhi Liquor Case: కేజ్రీవాల్‌కి దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌ని కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ABN , Publish Date - Aug 05 , 2024 | 03:18 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై(Bail Petition) విచారించిన ధర్మాసనం పిటిషన్‌ని కొట్టేసింది.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై(Bail Petition) విచారించిన ధర్మాసనం పిటిషన్‌ని కొట్టేసింది. దీంతో బెయిల్‌పై ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్‌కి ఊరట దక్కలేదు. ఈ ఘటనను చట్టవిరుద్ధమైన అరెస్టు అని చెప్పలేమని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బెయిల్ దరఖాస్తు కోసం కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
పిటిషన్లో ఏముందంటే..
లిక్కర్ కేసులో అవినీతి జరిగిందంటూ సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎన్ హరిహరన్, రమేష్ గుప్తా వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున ఎస్పీపీ సింగ్ హాజరయ్యారు. ఈ పాలసీపై కేజ్రీవాల్‌తోపాటు అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా సంతకం చేశారని సింఘ్వి వాదించారు.
మాజీ ఎల్జీ, బ్యూరోక్రాట్‌లను కూడా నిందితులుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మొత్తం కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని సింగ్ తెలిపారు. అరెస్టు చట్టవిరుద్ధం కాదని ట్రయల్ కోర్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిందని ఆయన అన్నారు. కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని.. ముఖ్యమంత్రికి బెయిల్‌పై విడుదలయ్యే అర్హత లేదని సింగ్ పేర్కొన్నారు. సహ నిందితులు మనీష్ సిసోదియా, కె కవితపై ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు.
'ఇన్సూరెన్స్ అరెస్ట్' అనే పదాన్ని ఉపయోగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు సీబీఐ ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించకుండానే నేరుగా బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కాం కేసుల్లోనే ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. మేలో, సాధారణ ఎన్నికల దృష్ట్యా జూన్ 01 వరకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న ఆయన తిరిగి లొంగిపోయారు.
For Latest News and National News click here