Share News

Delhi : కోచింగ్‌ సెంటర్‌లో మరణాల కేసు సీబీఐకి

ABN , Publish Date - Aug 03 , 2024 | 04:57 AM

ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Delhi : కోచింగ్‌ సెంటర్‌లో మరణాల కేసు సీబీఐకి

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తును పర్యవేక్షించడానికి ఓ అధికారిని నియమించాలని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు సూచించింది.

కేసు దర్యాప్తును సక్రమంగా నిర్వహించని ఢిల్లీ పోలీసులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బేస్‌మెంట్‌లో వరదలకు కారణమయ్యాడంటూ ఎస్‌యూవీ డ్రైవర్‌ మనుజ్‌ను అరెస్టు చేయడాన్ని కూడా విమర్శించింది. ‘ఇంకా నయం! బేస్‌మెంట్‌లోకి వెళ్లావంటూ వరద నీటిపై చలానా రాయలేదు’ అని కోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

Updated Date - Aug 03 , 2024 | 04:57 AM