Mizoram: రూ.42.38 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ABN , Publish Date - Jul 26 , 2024 | 06:42 PM
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిజోరాం శాంతి భద్రతల ఐజీ శుక్రవారం సిల్చార్‌లో వెల్లడించారు.
సిల్చార్, జులై 26: ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిజోరాం శాంతి భద్రతల ఐజీ శుక్రవారం సిల్చార్‌లో వెల్లడించారు.
CM Pushkar Singh Dhami: కార్గిల్ విజయ్ దివస్ వేళ ఉత్తరాఖండ్ ‘అగ్నివీరులకు’ గిఫ్ట్
రూ. 42.38 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
మొత్తం 14.082 కేజీల మెథాంఫేటమిన్‌తోపాటు 2.804 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ విలువ రూ. 42.38 కోట్లు ఉంటుందని వివరించారు. ఈ డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పొరుగునే ఉన్న త్రిపురకు చెందిన వారని చెప్పారు. అయితే వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచామన్నారు. అక్రమంగా భారీ స్థాయిలో డ్రగ్స్ తరలిస్తున్న తమకు సమాచారం అందిందన్నారు. ఆక్రమంలో సీఐడీతోపాటు ప్రత్యేక నార్కోటిక్ పోలీసులు ఖవ్జాల్ జిల్లాలోని దుల్తే గ్రామ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో వాహనంలోని రహస్య ప్రదేశంలో 191 బాక్స్‌ల్లో ఉంచిన ఈ డ్రగ్స్‌ను పోలీసులు కనుగొన్నారన్నారు.
Also Read: Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
ముగ్గురు అరెస్ట్..
అలాగే ఈ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులు.. ఎండీ ఇమామ్ హోసెన్ (23), రిపన్ హోసెన్ (37), నిరంజన్ ఖర్మార్కర్ (40)గా గుర్తించామన్నారు. అయితే వీరిపై స్పెషల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో వారిని విచారిస్తున్నామన్నారు.
Also Read: High alert in Jammu: ఆర్మీ స్కూల్స్ మూసివేత.. ఎందుకంటే..?
డ్రగ్స్ ఒక్కటే కాదు.. జంతువులు సైతం అక్రమ రవాణా..
మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ఇక ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా పట్టిష్టం చేసినప్పటికి డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతుంది. అియితే మిజోరాంలో డ్రగ్స్ అక్రమ రవాణా భారీగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు డ్రగ్స్ పట్టుబడినా.. దాని విలువ కోట్లాది రూపాయిల్లోనే ఉండడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో అక్రమ రవాణా చేస్తున్న హెరాయిన్ భారీ మొత్తంలో పట్టుకున్నారు.
Also Read: Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం
దాని విలువ సైతం దాదాపు రూ.17 కోట్లు ఉంటుందని పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఒక్కటే కాదు.. జంతువుల అక్రమ రవాణా సైతం జరుగుతుంది. గతంలో విదేశాలకు చెందిన జంతువులు, పక్షులను అక్రమ రవాణా చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి జంతువులు, పశుపక్ష్యాదులకు విముక్తి కలిగించారు.
For Latest News and National News click here