Share News

EC : హరియాణా ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:02 AM

హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది.

EC : హరియాణా ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

  • పోలింగ్‌ అక్టోబరు 1న బదులు 5న.. లెక్కింపు 8వ తేదీన

  • అసోజ్‌ అమావాస్య కారణంగానే సవరణ

  • హరియాణా ఎన్నికల తేదీల సవరణ

హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది. పోలింగ్‌ను అక్టోబరు 1 నుంచి 5వ తేదీకి, ఓట్ల లెక్కింపును అక్టోబరు 4 నుంచి 8వ తేదీకి మార్చింది. అసోజ్‌ అమావాస్యను పురస్కరించుకొని హరియాణా, రాజస్థాన్‌లోని బిష్ణోయ్‌ సామాజిక వర్గం వారు తమ గురువైన గురు జంబేశ్వర్‌ పూజల్లో పాల్గొంటారు. అక్టోబరు 1న ఎన్నికలు నిర్వహిస్తే వారు ఓటు హక్కును కోల్పోతారంటూ వినతులు రావడంతో ఈసీ ఈ మార్పులు చేసింది. కాగా, హరియాణా కారణంగా కశ్మీర్‌ ఓట్ల లెక్కింపు కూడా అక్టోబరు 8కి మారింది. అక్టోబరు 1న జరగనున్న కశ్మీర్‌ మూడో దశ పోలింగ్‌ తేదీలో మార్పుల్లేవు.

Updated Date - Sep 01 , 2024 | 04:02 AM