ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడని.. కొడుకుని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు
ABN , Publish Date - Nov 17 , 2024 | 03:43 AM
సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్న కొడుకును క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశాడు ఓ తండ్రి.
బెంగళూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్న కొడుకును క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశాడు ఓ తండ్రి. ఈ సంఘటన బెంగళూరు నగరంలోని కుమారస్వామి లే అవుట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన రవికుమార్ శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఆ సమయానికి కుమారుడు తేజస్ (14) సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ కనిపించాడు. తండ్రిని చూడగానే తేజస్ తనకు కొత్త ఫోన్ కొనివ్వాలని విసిగించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవికుమార్ అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో కొడుకు తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన తేజస్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స మృతి చెందాడు. కుమారస్వామి లే అవుట్ పోలీసులు కేసు నమోదు చేసి రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తేజస్ సుమారు 20 రోజులుగా బడికి వెళ్లకుండా బయట తిరుగుతున్నట్లు సమాచారం.