Share News

Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:05 PM

కాలం మరింది. దానికి అనుగుణంగా ప్రజలు సైతం మారారు. దీంతో వీధి రౌడీల నుంచి గ్యాంగ్‌స్టర్ల వరకు.. అందరికీ అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రాంతాలకు అతీతంగా దేశమంతా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద రౌడీలు ఎవరైనా జైలుకు ఇలా వెళ్లి.. అలా వచ్చారంటే.. వారి ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. జైలు నుంచి విడుదలైన వారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారు.

Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం

న్యూఢిల్లీ, జులై 26: కాలం మరింది. దానికి అనుగుణంగా ప్రజలు సైతం మారారు. దీంతో వీధి రౌడీల నుంచి గ్యాంగ్‌స్టర్ల వరకు.. అందరికీ అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రాంతాలకు అతీతంగా దేశమంతా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద రౌడీలు ఎవరైనా జైలుకు ఇలా వెళ్లి.. అలా వచ్చారంటే.. వారి ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. జైలు నుంచి విడుదలైన వారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారు. అలాగే జైలు నుంచి బయటకు వచ్చిన వారికి పూలదండలు వేసి.. కార్లు, బైకులతో భారీ ఊరేగింపుతో.. పెద్ద ర్యాలీగా తీసుకు వెళ్తారు. అలా వారికి తమ అభిమానాన్ని ఇలా చూపిస్తుంటారీ అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్లు.

Kargil Vijay Diwas 2024: అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలు.. తిప్పికొట్టిన ప్రధాని మోదీ.. పథకం ఉద్దేశం ఇది..


జులై 23న జైలు నుంచి విడుదల..

అయితే జైలు నుంచి విడుదలైన ఓ గ్యాంగ్‌స్టర్‌కు ఆయన అభిమానులు భారీగా కారు, బైక్ ర్యాలీ నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాను చుట్టేస్తుంది. దాంతో సదరు గ్యాంగ్‌స్టర్‌ను మళ్లీ శ్రీకృష్ణ జన్మస్థానంలోకి పంపారీ పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంది. నాసిక్‌లో గ్యాంగ్‌స్టర్ హర్షాద్ పట్నాకర్. అతడు మహారాష్ట్ర ప్రివెన్షన్ ఆప్ డేజంరస్ యాక్టివిటీస్ ఆఫ్ స్లమ్‌లార్డ్స్, బూట్‌లెగ్గర్స్, డ్రగ్స్ ఆఫెండర్ అండ్ డేంజర్ పర్సన్ యాక్ట్ (ఎంపీడీఏ) కింద అరెస్ట్ అయి.. జైలుకు వెళ్లారు. జులై 23న అతడిని జైలు నుంచి విడుదల చేశారు.


బేథల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ

దీంతో అతడి అభిమానులు, మద్దతుదారులు భారీగా కారు ర్యాలీ నిర్వహించారు. అదీకూడా బేథల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆ క్రమంలో కారు పైభాగంగా నిలబడి.. ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఈ వీడియోలను ఆయన అభిమానులు రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి వైరల్‌గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. వీటిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజాస్వామిక వాదులు అయితే ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు స్పందించారు.

maharastra-police.jpg


కొన్ని గంటల్లోనే అరెస్ట్.. మళ్లీ జైలుకు..

గ్యాంగ్‌స్టర్‌తోపాటు ఆయన అనుచరులను ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి.. మళ్లీ జైలుకు తరలించారు. వారిపై హత్యయత్నం, చోరీ, హింస కింద కేసులు నమోదు చేశారు. అయితే గ్యాంగ్‌స్టర్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు గ్యాంగ్‌స్టర్లకు సైతం రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయి. అందుకు దేశంలో ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. అలా వారు ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెడతున్నారు. దీంతో రౌడీ లేదా గ్యాంగ్‌స్టర్ ముదిరి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తుతున్నాడు. అందుకు సంబంధించిన ఘటనలు ఈ ప్రజాస్వామ్య దేశంలో కోకొల్లలు ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 03:06 PM