Share News

పెరిగిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 04:18 AM

దసరా పండుగకు ముందు వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు చమురు గ్యాస్‌ కంపెనీలు భారీ షాక్‌ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను సరాసరిన రూ. 48.50 మేర, 5 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. 12 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

పెరిగిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

న్యూఢిల్లీ, అక్టోబరు 1: దసరా పండుగకు ముందు వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు చమురు గ్యాస్‌ కంపెనీలు భారీ షాక్‌ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను సరాసరిన రూ. 48.50 మేర, 5 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. 12 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. పెరిగిన రేట్లతో దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1691.50గా ఉన్న 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1740కి చేరింది. 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను నెల క్రితమే చమురు కంపెనీలు రూ. 39 మేర పెంచాయి. కాగా, గృహ వినియోగదార గ్యాస్‌ సిలిండర్లు మాత్రం ప్రస్తుతం పాత ధరల వద్దే కొనసాగుతున్నాయి.

Updated Date - Oct 02 , 2024 | 04:18 AM