సరయూ తీరం దేదీప్యమానం
ABN , Publish Date - Oct 31 , 2024 | 05:32 AM
దీపావళి పండుగ సందర్భంగా బుధవారం అయోధ్యలోని సరయూ నదీ తీరంలో దీపోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించారు.
25లక్షల దీపాలతో గిన్నిస్ ప్రపంచ రికార్డు
అయోధ్య, అక్టోబరు 30: దీపావళి పండుగ సందర్భంగా బుధవారం అయోధ్యలోని సరయూ నదీ తీరంలో దీపోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. 25 లక్షల ప్రమిదల వెలుగులతో సరమూ తీరం దేదీప్యమానమైంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తర్వాత తొలి దీపావళి వేడుకలు కావడంతో నిర్వహకులు సరయూ తీరంలో భారీగా ఏర్పాటు చేశారు. 55 ఘాట్‌లలో వెలిగించిన లక్షలాది ప్రమిదలను గిన్నిస్ వరల్ట్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్లతో లెక్కించారు. మొత్తంగా 25,12,585 దీపాలను వెలిగించినట్లు వెల్లడించారు. ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డు. మరోవైపు, బుధవారమే సరమూ తీరంలో 1,121 మంది వేదాచార్యులు ఒకేసారి హారతి సమర్పించారు. ఇది కూడా గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకెక్కింది.