Share News

Delhi: ఆరితేరుతున్న హ్యాకర్లు.. ఏకంగా ఆ టెక్నాలజీతో సైబర్ దాడులు

ABN , Publish Date - Feb 15 , 2024 | 06:02 PM

దేశ వ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్న వేళ బహుళ దిగ్గజ కంపెనీలు చేసిన ప్రకటన ఆందోళనకు గురి చేస్తోంది. హ్యాకర్లు సైబర్-అటాక్ టెక్నిక్‌లను మెరుగుపరుచుకోవడానికి చాట్‌జీపీటీ వంటి ఎల్‌ఎల్‌ఎమ్‌లను ఉపయోగిస్తున్నారని మైక్రోసాఫ్ట్(Microsoft), ఓపెన్‌ఎఐ(Open AI) కంపెనీలు గురువారం వెల్లడించాయి.

Delhi: ఆరితేరుతున్న హ్యాకర్లు.. ఏకంగా ఆ టెక్నాలజీతో సైబర్ దాడులు

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్న వేళ బహుళ దిగ్గజ కంపెనీలు చేసిన ప్రకటన ఆందోళనకు గురి చేస్తోంది. హ్యాకర్లు సైబర్-అటాక్ టెక్నిక్‌లను మెరుగుపరుచుకోవడానికి చాట్‌జీపీటీ వంటి ఎల్‌ఎల్‌ఎమ్‌లను ఉపయోగిస్తున్నారని మైక్రోసాఫ్ట్(Microsoft), ఓపెన్‌ఎఐ(Open AI) కంపెనీలు గురువారం వెల్లడించాయి. లక్ష్యాలపై పరిశోధన, సామాజిక ఇంజినీరింగ్ పద్ధతులను రూపొందించడం కోసం ChatGPT వంటి సాధనాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పాయి.

రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, చైనాల్లో వీరు స్థావరాలు ఏర్పరుచుకున్నట్లు గుర్తించాయి. ఆయా దేశాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ ముఠాలో ఉన్నట్లు గుర్తించాయి. వారి ఓపెన్ ఏఐ అకౌంట్లు రద్దు చేసినట్లు మైక్రోసాఫ్ట్ యాజమాన్యం తెలిపింది. ప్రజలు సైబర్ నేరాలపట్ల అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని, ఓటీపీలు అడిగితే చెప్పకూడదని అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 06:03 PM